Representational Image (Photo Credits: Pixabay)

అతడు తన ప్రియురాలి గురించి స్నేహితులతో ఎంతో గొప్పగా చెప్పేవాడు. ఆ అమ్మాయి అంటే అతడికి చాలా ఇష్టం, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అందంగా ఉండటం మాత్రమే కాదు, చాలా బుద్ధిమంతురాలు, చాలా సైలైంట్, ఎప్పుడూ లైబ్రరీలోనే కాలంగడిపే పుస్తకాల పురుగు, చదువు తప్ప వేరే ధ్యాస లేదు. ఇవే అతడికి ఆ అమ్మాయి పట్ల పిచ్చి ప్రేమను కల్పించాయి. వారిద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు, ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వారు కావడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. దీంతో ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్ లో కలిసి ఉండేవారు. కాకపోతే, ఆ అమ్మాయిని అతడు చాలా పవిత్రంగా చూశాడు. ఆమె ప్రతిరోజూ లైబ్రరీకి వెళ్తున్నాను అని చెప్పేది. నేను వస్తాను అని అతడు అడిగినపుడు, నువ్వొస్తే నా ఏకాగ్రత దెబ్బతింటుంది. ప్లీజ్ వొద్దూ అంటూ ప్రేమగా చెప్పేది. దీంతో అతడు పాపం పిచ్చిది చదువుకోని, ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకొని తనతో వెళ్లలేదు.

అయితే ఒకరోజూ అతడి స్నేహితుడు ఓ వైబ్‌సైట్లో నీలిచిత్రాలు (Porn Videos) చూస్తూ ఉన్నాడు. దాంట్లో ఒక అమ్మాయికి సంబంధించిన వీడియోలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒంపుసొంపులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, అయితే ఈ అమ్మాయిని ఎక్కడో చూశానని భావించి గుర్తు చేసుకోగా ఆమె ఎవరో కాదు తన స్నేహితుడి లవర్ అని తెలుస్తుంది. దీంతో వెంటనే తన స్నేహితుడికి విషయం చెప్పాడు. అయితే అతడి మాటలు ప్రియుడు వినలేదు, ఇదే విషయాన్ని ప్రియుడి అన్న కూడా ప్రశ్నిస్తాడు. నువు పెళ్లి చేసుకుంటానని చెప్తున్న ఆ అమ్మాయి పాపులర్ పోర్న్ స్టార్ (Porn Star) , ఆమెకు వెంటనే బ్రేకప్ చెప్పేసి దూరంగా వెళ్లు అని హెచ్చరిస్తాడు. కావాలంటే ఆ వెబ్ సైట్లో "లైబ్రరీ" (Library) అని టైప్ చేసి చూడు ఆమె ఎంత పాపులరో తెలుస్తుంది అని చెప్తాడు. దీంతో ప్రియుడు షాక్ తిన్నాడు, వెబ్ సైట్లో కుప్పలుతెప్పలుగా ఉన్న ఆమె నగ్న వీడియోలు, విభిన్న భంగిమల్లో ఆమె శృంగార వీడియోలు చూసి ఆ ప్రియుడి గుండె వెయ్యి ముక్కలైంది. తనకు మాత్రమే సొంతం అనుకున్న ఆ దేవత, ఎందరికో ప్రసాదం పంచడం చూసి తల్లడిల్లిపోయాడు.

ఇంతకీ, ఆ ప్రియుడి పేరు జియావో చువాన్ (Xiao Chuan) ఒక చైనీస్, ఆస్ట్రేలియాలో ఒక టాప్ యూనివర్శిటీలో చదువుతున్నాడు. ఆ అమ్మాయి కూడా చైనీసే, సేమ్ అతడి యూనివర్శిటీలోనే చదువుతుంది.

కాగా, ఈ విషయంపై జియావో అతడి ప్రియురాలిని నిలదీయగా, తాను సింపుల్ గా డబ్బు కోసం తాను ఆ పని చేస్తున్నట్లు చెప్పింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన పోర్న్ వీడియోలు ఎంతో పాపులర్ అని, ఎంతో మందికి తాను పరిచయమేనని, ఆ వీడియోలు చూసే నువు కూడా ఆకర్శితుడివై నాతో స్నేహం చేయడానికి ఆసక్తి చూపావేమో అని భావించినట్లు జియావోతో అసలు విషయం చెప్పింది.

దీంతో జీయావోకి ఏం చేయాలో తెలియలేదు, అయినప్పటికీ తనతో ఎప్పట్లాగే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే జియావో పేరేంట్స్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ జంట విడిపోయారు అంటూ చైనా ప్రెస్ వెల్లడించింది.