Boris Johnson and Carrie Symonds (Photo Credits: Instagram)

London, May 30: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు (UK PM Boris Johnson Wedding) అక్కడి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. లండన్​లో వెస్ట్​మినిస్టర్​ క్యాథెడ్రల్​లో ప్రియురాలు క్యారీ సైమండ్స్​తో శనివారం బోరిస్​ రహస్య వివాహం (UK Prime Minister Boris Johnson Marries Fiancee Carrie Symonds) జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ది సన్​, మెయిల్​ ఆన్​ సండేవర్క్​ లాంటి టాబ్లాయిడ్​లు ప్రముఖంగా ప్రచురించాయి. బోరిస్​-సైమండ్స్​ వివాహానికి సీనియర్ సభ్యులతో సహా ఎవరికీ ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది.

ఈ పెళ్లి విషయం ప్రధాని కార్యాలయంలో సీనియర్‌ అధికారులకు కూడా తెలియనీయలేదు. వీరి పెళ్లి జరిగిన కేథలిక్‌ కెథడ్రాల్‌ని మధ్యాహ్నం 1.30 సమయంలో మూసివేశారు. ఒక అర్ధగంట తర్వాత 33 ఏళ్ల సైమోడ్స్‌ లిమోజిన్‌ వాహనంలో అక్కడకు వచ్చారు. ఆమె తెల్లటి గౌను ధరించి ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పెళ్లిళ్లకు కేవలం 30 మంది అతిథులుమాత్రమే ఉండాలనే నిబంధన అమల్లో ఉంది. ఈ అంశంపై బ్రిటన్‌ ప్రధాని అధికార నివాసమైన డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.

చైనాపై మళ్లీ కొత్త కరోనా వేరియంట్ దాడి, తాజాగా 20 కోవిడ్ కేసులు నమోదు, గాంజావ్‌ నగరంలో పూర్తిగా లాక్‌డౌన్, వియత్నాంలో కొత్తగా హైబ్రిడ్‌ మ్యూటెంట్‌ వెలుగులోకి, అక్కడ రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి పుట్టుకొచ్చిన కొత్త సంకర జాతి కరోనా వైరస్‌

కేవలం కొద్దిమంది గెస్టుల మధ్య.. అది కూడా చివరి నిమిషంలో వాళ్లకు ఆహ్వానం ఇచ్చినట్లు ఆ పత్రికలు రాశాయి. బోరిస్ 2019లో ప్రధాని అయ్యాక డౌనింగ్​ స్ట్రీట్​లో తన గర్ల్​ఫ్రెండ్​ సైమండ్స్​(33)తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. పోయినేడాది ఎంగేజ్​మెంట్ చేసుకున్న ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. అయితే వచ్చే ఏడాది జులైలో వీళ్ల పెళ్లి జరగొచ్చని కొన్ని పత్రికలు కథనాలు రాసినప్పటికీ.. ఇప్పుడు హడావుడిగా పెళ్లి జరిగిందని అదే పత్రికలు మరోసారి కథనాలు రాశాయి.

ప్రపంచంలో కరోనా టీకా తీసుకున్నతొలి వ్యక్తి విలియం షేక్‌స్పియర్‌ కన్నుమూత, వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో మృతి

గతంలో బోరిస్(56)​ వివాహేతర సంబంధంతో కన్​జర్వేటివ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. కాగా, బోరిస్​ జాన్సన్​కి ఇది మూడో వివాహం. గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. చివరిసారిగా మరీనా వీలర్​ అనే లాయర్​కి 2018లో విడాకులిచ్చారు.ఆయన రెండో భార్య మారినా వేలర్‌కు నలుగురు సంతానం. ఈమధ్యే బోరిస్​కు సలహాదారుడిగా పని చేసిన డొమినిక్​ కమింగ్స్.. ప్రధాని పదవికి బోరిస్​ అనర్హుడంటూ సంచలన కామెంట్స్​ చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్​ ప్రధాని పదవిలో ఉండి లార్డ్​ లివర్​పూల్​ 1822లో పెళ్లి చేసుకున్నాడు.