Covid in China: చైనాపై మళ్లీ కొత్త కరోనా వేరియంట్ దాడి, తాజాగా 20 కోవిడ్ కేసులు నమోదు, గాంజావ్‌ నగరంలో పూర్తిగా లాక్‌డౌన్, వియత్నాంలో కొత్తగా హైబ్రిడ్‌ మ్యూటెంట్‌ వెలుగులోకి, అక్కడ రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి పుట్టుకొచ్చిన కొత్త సంకర జాతి కరోనా వైరస్‌
A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

Beijing, May 29: చైనాలో మళ్లీ కొత్త కరోనావైరస్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అక్కడ పూర్తిగా వైరస్ (Coronavirus in China) అదుపులోకి తీసుకొచ్చామని ఆనందించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

తాజాగా 1.5 కోట్ల మంది నివాసముండే పారిశ్రామిక ప్రాంతం గాంజావ్‌ నగరంలో 20 కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ (Guangzhou lockdown) అమల్లోకి తీసుకువచ్చారు. అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాల వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

గాంజావ్‌ నగరంలో వారం రోజుల్లో 20 కొవిడ్‌ కేసులు (coronavirus upsurge) నమోదయ్యాయి. ఇవి కొత్త కరోనా వేరియంట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. గత వేరియంట్ల కంటే ఈ కొత్త వేరియంట్‌ మరింత ప్రమాదకరమైనదని, చాలా ఉద్ధృతంగా ఉందని చైనా అధికారులు వెల్లడించినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ వార్తాపత్రిక పేర్కొంది. కొత్త వేరియంట్‌ను కనుగొనేందుకు లివాన్‌ జిల్లాలో శనివారం పరీక్షలకు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించనుంది.

ప్రపంచంలో కరోనా టీకా తీసుకున్నతొలి వ్యక్తి విలియం షేక్‌స్పియర్‌ కన్నుమూత, వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో మృతి

బహిరంగ మార్కెట్లు, శిశు సంరక్షణ కేంద్రాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, రెస్టారంట్లపై నిషేధం విధించింది. బహిరంగ కార్యక్రమాలను పరిమితం చేయాలని లివాన్‌కు చుట్టుపక్కల నాలుగు జిల్లాల అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉంటే చైనాలో ప్రతిరోజు కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అయితే వారంతా విదేశాల నుంచి వస్తున్నవారే. కానీ ఇద్దరు స్థానికులతోపాటు, దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో మరో 14 మందికి కొత్త రకం వైరస్ సోకినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది.

కరోనా మూడవ దశ ముప్పు..ముందు జాగ్రత్తగా జూన్ 7 వరకూ లాక్‌డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న మలేసియా ప్రభుత్వం, మే 12 నుంచి జూన్ 7 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపిన ప్రధాని ముహ్యుద్దీన్ యాసిన్

ఈ పరిస్థితులు ఇలా ఉంటే రూపు మార్చుకున్న రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి అ‍త్యంత ప్రమాదకరమైన సంకర జాతి కరోనా వైరస్‌ పుట్టుకొచ్చింది. వియత్నాంలో సంకర కరోనా మ్యూటెంట్‌ ( హైబ్రిడ్‌ మ్యూటెంట్‌)ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇండియాలో, బ్రిటన్‌లలో విపత్తును సృష్టించిన కరోనా మ్యూటెంట్ల లక్షణాలతో ఈ కొత్త హైబ్రిడ్‌ వేరియంట్‌ (Vietnam detects of hybrid variant) పుట్టుకొచ్చినట్టు వియత్నాం హెల్త్‌ మినిష్టర్‌ న్యూయెన్‌ థాన్‌ (Health Minister Nguyen Thanh Long) ప్రకటించారు.

వియత్నాం దేశాన్ని ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ చుట్టేస్తోంది. దేశంలో ఉన్న 63 నగరాల్లో 31 నగరాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఈ 31 నగరాల నుంచే వస్తున్నాయి. దీంతో ఇక్కడ కరోనా బారిన పడ్డ రోగుల నుంచి తీసుకున్న శాంపిల్స్‌ పరిశీలించగా.... ఇండియా, బ్రిటన్‌లలో వెలుగు చూసిన కరోనా వేరియంట్‌ లక్షణాలతో కొత్త హైబ్రిడ్‌ వేరియంట్‌ పుట్టుకొచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

మళ్లీ వెలుగులోకి కొత్త కరోనావైరస్, కుక్కల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్న CCoV-HuPn-2018, ప్రమాదకరమా కాదా అనే దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్న డ్యూక్‌ యూనివర్శిటీ పరిశోధకులు

ఈ వైరస్‌ పూర్వపు మ్యూటెంట్లను మించిన వేగంతో త్వరగా వ్యాపిస్తోందని, గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరి సోకే లక్షణం ఈ హైబ్రిడ్‌కు రకానికి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా, బ్రిటన్‌లలో వెలుగు చూసిన వేరియంట్ల కంటే ఇది ప్రాణాలకు ఎక్కువ ముప్పు తెస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హైబ్రిడ్‌వేరియంట్‌కి సంబంధించిన సమాచారం త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేస్తామని వియత్నాం అంటోంది.

ఇప్పటికే వియత్నాంలో ఏడు రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కరోనా వేరియంట్ల వ్యాప్తిని గతంలో అక్కడి ప్రభుత్వం కట్టడి చేసింది. కానీ హైబ్రిడ్‌ రకం మ్యూటెంట్‌కు అడ్డకట్ట వేయడం కష్టంగా మారింది. ఇప్పటికే ఆ దేశంలో 6,396 మంది కరోనా బారిన పడగా 47 మంది మరణించారు. దేశంలో రోజురోజుకి హైబ్రిడ్‌ రకం ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో వియత్నాం ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది.