Banning Men From Masturbating (Credits: X)

Newyork, Feb 1: ఆ దేశంలో పురుషుల హస్త ప్రయోగంపై (Banning Men From Masturbating) నిషేధం విధించాలని యోచిస్తున్నారు. అంతేకాదు అతిక్రమిస్తే నేరంగా పరిగణించాలని పట్టు బడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా (America) సెనేట్‌ ముందుకు ఒక బిల్లు వచ్చింది. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మిసిసిప్పి సెనేటర్‌ బ్రాడ్‌ఫర్డ్‌ బ్లాక్‌మన్‌ గత వారం పురుషుల హస్త ప్రయోగంపై నిషేధం విధించాలని ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ‘గర్భనిరోధకం అంగస్తంభన వద్ద ప్రారంభం’ అని పేరు పెట్టారు. ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాల్చి అమలులోకి వస్తే మిసిసిప్పి రాష్ట్రంలో పురుషులు హస్త ప్రయోగం చేసుకోవడం, పిండాన్ని ఫలదీకరించే ఉద్దేశం లేకుండా శృంగారంలో పాల్గొనడం నేరం అవుతుంది.

నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జరిమానాలు ఇలా..

‘గర్భనిరోధకం అంగస్తంభన వద్ద ప్రారంభం’ చట్టాన్ని అతిక్రమించిన వారికి మొదటిసారి రూ.86 వేలు, రెండోసారి రూ.4.33 లక్షలు, తరచూ ఉల్లంఘించే వారికి రూ.8.65 లక్షల జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అయితే, ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. వీర్యదానం కోసం హస్త ప్రయోగం చేసుకోవడం, కండోమ్‌ వాడి శృంగారంలో పాల్గొనడం మాత్రం ఈ బిల్లు ప్రకారం నేరం కాదు.

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ రోజే తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర తగ్గిందంటే??