LPG (Credits: X)

Newdelhi, Feb 1: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నేడు బడ్జెట్‌ ను ప్రవేశపెట్టే సమయంలో గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై (Commercial LPG Cylinder Prices) రూ. 7 చొప్పున తగ్గించాయి. దీంతో  దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,797 రూపాయలకు తగ్గింది. నిన్నటి వరకు ఈ ధర 1,804 రూపాయలుగా ఉండేది. కోల్‌ కతలో రూ. 1,911.50 పైసల నుంచి రూ.1,907.50 పైసలకు తగ్గింది. ముంబైలో రూ. 1,756 నుంచి 1,749 రూపాయలు, చెన్నైలో 1,966.50 పైసల నుంచి 1,959 రూపాయలకు తగ్గింది. తగ్గినా ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయి. అయితే గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఉన్న ధర కొనసాగుతోంది.

పార్లమెంట్ లో మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్దుపై మధ్యతరగతి ఆశలెన్నో..?

పెరుగుతాయి అనుకుంటే..

జాతరలు, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సిలిండర్ ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావించారు. కానీ అనూహ్యంగా  సిలిండర్ ధర గణనీయంగా తగ్గడంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 1వ తేదీన ఒక్కో వాణిజ్య సిలిండర్‌ పై రూ.14.50 మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వాటి రేట్లు తగ్గుముఖం పట్టాయి.

సరికొత్త రికార్డు సృష్టించే దిశగా నిర్మలా సీతారామన్, అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా అతి త్వరలోనే రికార్డు