ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం యూట్యూబ్ (YouTube) భారత్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరల్ని పెంచింది. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలంటే యూజర్లు డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఫ్యామిలీ, స్టూడెంట్, వ్యక్తిగత ప్లాన్ అన్నింటి ధరల్ని సవరించింది. కొత్త ధరలు కంపెనీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
యూట్యూబ్ వ్యక్తిగత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ.149గా నిర్ణయించింది. ఇంతకు ముందు ఈ ధర రూ.129గా ఉండేది. గతంలో రూ.189గా ఉన్న ఫ్యామిలీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరను ప్రస్తుతం రూ.299కి పెంచింది. ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే కుటుంబంలోని ఐదుగురు ప్రీమియం ప్రయోజనాలు పొందొచ్చు. ఇక ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ ధర రూ.79 నుంచి రూ.89కి పెంచింది. ప్రీపెయిడ్‌తోపాటు రెన్యువల్ సబ్‌స్క్రిప్షన్ ధరల్ని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సవరించింది. ఆపిల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు, వచ్చే ఏడాది నాటికి ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లుగా వార్తలు
అలాగే వ్యక్తిగత ప్రీపెయిడ్ ప్లాన్ ధర నెలకు రూ.159కి సవరించింది. గతంలో ఈ ధర కేవలం రూ.139గా ఉండేది. ఇక వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్ ధరను రూ.399 నుంచి రూ.459కి సవరించింది. ఇక వార్షిక ప్లాన్‌ను రూ.1290 నుంచి రూ.1490కి పెంచేసింది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకొనేందుకు యూట్యూబ్ 30 సెకండ్ల పాటు అన్‌స్కిప్పబుల్ యాడ్స్‌ని చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది.