Hyderabad, Dec 1: గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) వినియోగదారులకు షాక్ కలిగించే వార్త ఇది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ (Commercial Gas Cylinder) ధరను రూ.21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కాగా, గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరలు పెరగకపోవడం ఒకింత ఉపశమనం లభించినట్లే.
LPG Price Hike Today: Commercial Cylinder Price Hiked By Rs 21, Check Latest Rates In Your City#LPGcylinder #LPGPrice #lpgsubsidy #trending2023 #Trendinghttps://t.co/GMY1WvaOTV
— India.com (@indiacom) December 1, 2023
ఎక్కడ ఎంత?
తాజా పెరుగుదలతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50కు చేరింది. ఇక కోల్‌కతాలో రూ.1908, ముంబైలో రూ.1749, చెన్నైలో రూ.1968.50కు పెరిగింది. ఇక ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో రాజధానులైన జైపూర్ (రాజస్థాన్) రూ.1819, భోపాల్ (మధ్యప్రదేశ్) రూ.1804, రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) రూ.2004, హైదరాబాద్‌లో రూ.2024.5గా ఉన్నది.