Representational Image (File Photo)

Hyderabad, Dec 1: తెలంగాణలో (Telangana) ఎన్నికల పోలింగ్ (Election Polling) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఓటు (Vote) హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 వరకు పోలింగ్ స్టేషన్లలో క్యూలైన్లనలో నిల్చున్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 10 వరకు ఓటర్లు క్యూలైన్లలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. 2018తో పోలిస్తే ఈసారి పోలింగ్ 3 శాతం తగ్గినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 70.66 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం ఓటింగ్ నమోదు కాగా.. హైద్రాబాద్‌లో అత్యల్పంగా 46.56 శాతం నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడు నియోజవర్గంలో అత్యధికంగా 91.51 శాతం నమోదైంది. అత్యల్పంగా యాకుత్‌పురాలో 39.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Cyclone Michaung: ఏపీకి తుఫాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం, త్వరలో తుఫాను బలపడనున్న వైనం.. నేటి నుంచి మూడు నాలుగు రోజుల పాటు కోస్తాతో పాటు రాయలసీమలోనూ వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక

జిల్లాల వారీగా పోలింగ్ ఇలా...

  • ఆసిఫాబాద్ – 80.82
  • సిద్దిపేట – 79.84
  • కామారెడ్డి – 79.59
  • నాగర్ కర్నూల్ – 79.46
  • భద్రాద్రి – 78.65
  • నిర్మల్ – 78.24
  • వరంగల్ – 78.06
  • మహబూబ్‌ నగర్ – 77.72
  • వనపర్తి – 77.64
  • నారాయణపేట – 76.74
  • పెద్దపల్లి – 76.57
  • వికారాబాద్ – 76.47
  • సంగారెడ్డి – 76.35
  • సిరిసిల్ల – 76.12
  • జగిత్యాల – 76.10
  • మంచిర్యాల – 75.59
  • కరీంనగర్ – 74.61
  • నిజామాబాద్ – 73.72
  • హనుమకొండ – 66.38
  • మేడ్చల్ – 56
  • రంగారెడ్డి – 59.94
  • హైదరాబాద్-46.56
  • యాదాద్రి – 90.03
  • మెదక్ – 86.69
  • జనగాం – 85.74
  • నల్గొండ – 85.49
  • సూర్యాపేట – 84.83
  • మహబూబాబాద్ – 83.70
  • ఖమ్మం – 83.28
  • ములుగు – 82.09
  • భూపాలపల్లి – 81.20
  • గద్వాల్ – 81.16

Telangana Assembly Election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదు