Representational Image (Pixabay)

Hyderabad, Dec 1: ఏపీకి (AP) తుఫాను (Cyclone) ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడి ఏపీలో కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మైచౌంగ్‌ గా (Cyclone Michaung) నామకరణం చేసిన ఈ తుఫాను డిసెంబర్ 4 లేదా 5వ తేదీనా ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని పేర్కొంది. అయితే, ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ప్రస్తుతం చెప్పలేమని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను కారణంగా కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకూ భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది.

Telangana Assembly Election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదు

హెచ్చరికలు జారీ

అల్పపీడనం కారణంగా కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకూ వర్షపాతం నమోదవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి