Telangana Assembly Election 2023 Live Updates: తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతించారు. దీంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అత్యధికంగా జనగాం, మెదక్ జిల్లాల్లో 80:28 శాతం నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ 39.97శాతం పోలింగ్ నమోదు అయింది. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి
Here's ANI News
#TelanganaElections | 63.94% voter turnout recorded in Telangana till 5pm. pic.twitter.com/jeIsGzKWTD
— ANI (@ANI) November 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)