Commercial Lpg Cylinder Prices Hike: మరోసారి బాదుడు షురూ, రెండు నెలల్లో రెండు సార్లు పెరిగిన సిలిండర్ ధర, ఏ, యే నగరాల్లో ఎంత అంటే ?
Commercial LPG (File: Google)

New Delhi, NOV 01: దేశంలో మళ్లీ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ (Commercial Lpg Cylinder) ధర పెరిగింది. బుధవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 100 రూపాయలకు పైగా పెరిగింది. గత రెండు నెలల్లో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెంచడం (Price Hike) ఇది రెండోసారి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు బుధవారం దేశంలోని పలు చోట్ల వాణిజ్య ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలను రూ. 100కు పైగా పెంచాయి.  19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1,731కి బదులుగా రూ.1,833 అవుతుంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల (Commercial Lpg Cylinder) ధర పెరుగుదలతో హోటళ్లలో తినుబండారాల ధరలు కూడా పెరగనున్నాయి.

Onion Price Soar: సామాన్య ప్రజలకు కేంద్రం శుభవార్త, సబ్సిడీ ద్వారా కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకే అందుబాటులోకి..

ముంబయిలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రూ.1,785.50, కోల్‌కతాలో రూ.1,943, చెన్నైలో రూ.1,999.50లకు పెరిగింది. అక్టోబర్‌లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు ముంబయిలో రూ.1,684, కోల్‌కతాలో రూ.1,839.50, చెన్నైలో రూ.1,898గా ఉన్నాయి. గృహ అవసరాల వంట అవసరాల కోసం ఉపయోగించే కిలోల సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.903 వద్ద ఉంది. దేశీయ వంట సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలను కేంద్రం పెంచలేదు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు మాత్రమే పెంచింది.