Newdelhi, Feb 1: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో (SC, ST Case) సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కులం పేరుతో దూషించాడని ఓ వ్యక్తికి శిక్ష విధించాలన్నా.. ఈ మేరకు అతని నేరం రుజువు చేయాలన్నా.. నిందితుడు బహిరంగంగా కులం పేరుతో దూషించి ఉండాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించి నమోదైన కేసును కొట్టివేసింది. 1989లోని సెక్షన్ 3(1)(ఆర్) కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా అవమానించినట్టు కానీ, బెదిరించినట్టు కానీ నిరూపించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ రోజే తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర తగ్గిందంటే??
తాజా కేసులో ఘటన నాలుగు గోడల మధ్య జరిగిందని, అది జరిగిన తర్వాత ఫిర్యాదుదారుడి సహచరులు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఎఫ్ఐఆర్ పేర్కొనడాన్ని న్యాయస్థానం ఎత్తిచూపింది. కేసుకు కారణమైన ఘటన అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదని పేర్కొన్న ధర్మాసనం కేసును కొట్టివేసింది.
Supreme Court Quashes SC-ST Act Case, Citing Incident Not in Public View https://t.co/fZLRbzVp1w
— LawTrend (@law_trend) January 31, 2025
అలా జరుగాల్సిందే
అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(1) (ఎస్) కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించి ఉండాలని స్పష్టం చేసింది. గదిలో జరిగినట్టు చెప్తున్న విషయాన్ని ఎలా నమ్మగలం అని ప్రశ్నించింది.