Russia-Ukraine Conflict: రష్యాకు అమెరికా వార్నింగ్, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని వెల్లడి, అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించిన అగ్రరాజ్యం

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. ఏడు రోజులుగా జరుగుతున్న హోరాహోరి పోరులో (Russia-Ukraine Conflict) రెండు దేశాల సైన్యం శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. చావును సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైన్యం తెగువ చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.

Russia-Ukraine Conflict: రష్యాకు అమెరికా వార్నింగ్, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని వెల్లడి, అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించిన అగ్రరాజ్యం
US President Joe Biden (Photo Credits: ANI)

Washington, March 2: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. ఏడు రోజులుగా జరుగుతున్న హోరాహోరి పోరులో (Russia-Ukraine Conflict) రెండు దేశాల సైన్యం శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. చావును సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైన్యం తెగువ చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు.

ఉక్రెయిన్‌కు అమెరికా అండగా (US is Ready, Says Joe Biden) ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ను రష్యా బలహీనపర్చలేదని, ఉక్రెయిన్‌పై దాడులకు వ్లాదిమిర్ పుతిన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగవారం కాంగ్రెస్ సంయుక్త సమావేశం ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ను (First State of the Union Address) ఉద్దేశించి ప్రసంగించారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు దుర్మార్గమని మండిపడ్డారు. పుతిన్‌ను ప్రపంచం ఏకాకి చేయాలని బైడెన్ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ప్రతి భాగాన్ని కాపాడతామన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తామన్నారు. అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ తరఫున అమెరికా సేనలు యుద్ధం చేయవని తెలిపారు. ఉక్రెయిన్‌ను రష్యా ముట్టడించినా.. ప్రజల మనసులు పుతిన్‌ గెలుచుకోలేరన్నారు. రష్యాలో ఆర్థిక సంక్షోభానికి పుతినే కారణమని జో బైడెన్ అన్నారు. కాగా బుధవారం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. తొలి విడత చర్చల్లో ప్రాథమిక డిమాండ్లపై ఇరు దేశాలు పట్టు పట్టాయి.

ఈయూ పార్ల‌మెంటు కీలక ప్రకటన, ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం, పోరాటంలో ఎంత‌దాకా అయినా వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపిన జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ దేశ పౌరులు సైతం తుపాకులు చేతపట్టుకొని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై సైనిక దాడులకు దిగిన రష్యా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు. రష్యా, పుతిన్‌పై రానున్న కాలంలో యుద్ద ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్‌ గెలిచినా, ఓడినా.. ఆర్థిక పరంగా, ఇతర అంశాల విషయంలో రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

పుతిన్‌ ఓ నియంత.. అతడి అంతు చూస్తామంటూ బెడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ సహా పలు దేశాలు రష్యా చర్చను వ్యతిరేకిస్తూ ఆర్ధికపరమైన కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ పుతిన్‌ మాత్రం వెనకంజ వేయకుండా తగ్గేదేలే అన్నట్టుగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను టార్గెట్‌ చేసుకొని ముందుకు సాగుతున్నారు.

(The above story first appeared on LatestLY on Mar 02, 2022 10:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).