
New Delhi, Mar 1: ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ సభ్యత్వం వచ్చింది. కాసేపటి క్రితం ఈ మేరకు ఈయూ పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈయూలో సభ్యత్వం (European Union Accepts Ukraine's Membership ) ఇవ్వాలని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈయూ పార్లమెంటుకు దరఖాస్తు కూడా చేశారు. ఈ దరఖాస్తు చూశాక ఈయూ పార్లమెంటు అత్యవసరంగా భేటీ అయ్యింది.
ఈ భేటీకి జెలెన్ స్కీని కూడా ఆహ్వానించింది. ఈయూ ఆహ్వానం మేరకు ఈయూ పార్లమెంటుకు వెళ్లిన జెలెన్ స్కీ చేసిన భావోద్వేగభరిత ప్రసంగానికి సభ్య దేశాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాయి. ఆ వెంటనే ఉక్రెయిన్ చేసుకున్న దరఖాస్తును (Special Admission Procedure Initiated) పరిశీలించిన ఈయూ పార్లమెంటు..ఈయూలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇస్తున్నట్లుగా కీలక ప్రకటన చేసింది.
రష్యా సేనలతో తమ దేశ పౌరులు ధైర్యంగా పోరాడుతున్నారని చెప్పారు. ఈ పోరాటంలో (Ukraine Russia War) ఎంతదాకా అయినా వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. రష్యా బాంబు దాడుల్లో 16 మంది చిన్నారులు చనిపోయారని, తమ పిల్లలు క్షేమంగా జీవించాలన్నదే తమ కోరిక అని జెలెన్ స్కీ తెలిపారు. అసలు పుతిన్ లక్ష్యమేమిటని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ యుద్ధంలో ఈయూ సభ్య దేశాలు తమకు మద్దతుగా నిలబడతాయని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.
రష్యా కాల్పుల్లో భారత విద్యార్థి మృతి, ఆందోళన చెందుతున్న మిగతా విద్యార్థులు
పార్లమెంటులో జెలెన్‌స్కీ చేసిన ప్రసంగానికి ఈయూ దేశాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాయి. ఈయూ సభ్య దేశాలు తమకు మద్దతుగా నిలిచే దిశగా చర్యలు చేపట్టాలన్న డిమాండుతో జెలెన్‌స్కీ ఈయూ పార్లమెంటుకు వెళ్లారు. రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా జెలెన్ స్కీ స్పష్టం చేశారు. రష్యాకు తమ సత్తా ఏమిటో చూపుతామని కూడా ఆయన శపథం చేశారు. ఈ పోరాటంలో తప్పనిసరిగా విజయం సాధించి తీరతామని చెప్పారు. జెలెన్‌స్కీ చేసిన ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తిగా విన్న ఈయూ సభ్య దేశాల ప్రతినిధులు..ప్రసంగం ముగియగానే... ఆయనకు లేచి నిలబడి మరీ చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు. ఆ తర్వాత ఈయూ పార్లమెంటు అధ్యక్షురాలు మాట్లాడుతూ ఈయూ దేశాలన్నీ అండగా ఉంటాయని ప్రకటించారు