ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరో రోజు కూడా భీకరంగానే కొనసాగుతోంది. ఇప్పటికే కీవ్‌ ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి సరిహద్దు దేశాలకు వెళ్లిపోయారు. ఇక అక్కడ చదువుకుంటున్న భారత విద్యార్థులను తిరిగి దేశానికి రప్పించే ప్రయత్నంలో కేంద్రం నిమగ్నమైన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఖార్కీవ్‌లో రష్యన్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థి మృతి చెందాడు. కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌గా అధికారులు గుర్తించారు. ఉదయం ఖర్కీవ్‌లో జరిగిన దాడిలో చనిపోయినట్లు స్థానికి మీడియా ప్రకటించింది. విద్యార్థి మృతిని విదేశీ వ్యవహారాలశాఖ ధృవీకరించింది. ఈ ఘటనతో ఉక్రెయిన్‌లో ఉంటున్న మిగిలిన భారత విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)