New SIM Card Rules: సిమ్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆగస్టు 24 నుంచి కొత్త నిబంధనలు.. ఒక వ్యక్తి ఎన్ని సిమ్‌లు కలిగి ఉండొచ్చో తెలుసా?

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, నకిలీ గుర్తింపులతో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి తన పేరుపై ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి మొబైల్ సిమ్ కార్డులు తీసుకోకుండా టెలికాం సంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేసింది.

Representative Image

New SIM Card Rules: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, నకిలీ గుర్తింపులతో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి తన పేరుపై ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి మొబైల్ సిమ్ కార్డులు తీసుకోకుండా టెలికాం సంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు 2026 ఆగస్టు 24 నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్త విధానం ప్రకారం.. ఒక వ్యక్తి కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసినప్పుడు.. అతడి పేరుపై ఇప్పటికే ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో టెలికాం సంస్థలు పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం DoTకి చెందిన Digital Intelligence Platform (DIP) లో అందుబాటులో ఉండే సమాచారాన్ని టెలికాం కంపెనీలు ఉపయోగించనున్నాయి.

 మీ PF ఖాతాలో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. EPFO తెలిపిన ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి..

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం దేశంలోని సాధారణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి తన పేరుపై గరిష్ఠంగా 9 మొబైల్ కనెక్షన్లు కలిగి ఉండవచ్చు. అయితే జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్ఠ పరిమితి 6 కనెక్షన్లుగా ఉంది.

ఇప్పటికే గరిష్ఠ పరిమితికి చేరుకున్న వ్యక్తి మరో కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేస్తే.. ఆ దరఖాస్తును టెలికాం సంస్థ తిరస్కరించాల్సి ఉంటుంది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల పరిమితికి మించి కనెక్షన్ యాక్టివేట్ అయితే, ధృవీకరణ పూర్తయ్యే వరకు దానిని నిలిపివేయాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

కొత్త నిబంధనల్లో భాగంగా కేవలం పేరును మాత్రమే కాకుండా దరఖాస్తుదారుడి వివరాలు, ఫోటోను కూడా సరిపోల్చి చూసే విధానం తీసుకొస్తున్నారు. గరిష్ఠ పరిమితికి చేరుకున్న వినియోగదారులను ముందుగానే గుర్తించేందుకు DIPలోని సమాచారాన్ని టెలికాం సంస్థలు క్రమం తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకుని తమ వ్యవస్థల్లో తనిఖీ చేయాలి.

సిమ్ తీసుకునే సమయంలో సమర్పించే Customer Application Form (CAF)లో కూడా వినియోగదారుడి పేరుపై ఇప్పటికే ఉన్న మొబైల్ కనెక్షన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించాల్సి ఉంటుంది.

ప్రారంభ దశలో నమోదు, అనంతర ధృవీకరణ విధానంతో ఈ వ్యవస్థ పనిచేయనుంది. అయితే టెలికాం కంపెనీలు 2026 నవంబర్ 30లోగా రియల్‌టైమ్ ఇంటిగ్రేషన్ పూర్తి చేయాలని DoT గడువు విధించింది. ఆ తర్వాత సిమ్ కొనుగోలు చేసే సమయంలోనే వినియోగదారుడి వివరాలను రియల్‌టైమ్‌లో పరిశీలించి, కనెక్షన్ ఇవ్వాలా వద్దా అన్నది త్వరగా నిర్ణయించే అవకాశం ఉంటుంది.

ఒక వ్యక్తి గుర్తింపు వివరాలను దుర్వినియోగం చేసి పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులు తీసుకోవడం, వాటిని సైబర్ మోసాలు, స్పామ్ కాల్స్, ఇతర అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించడం వంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం. అయితే సాధారణ వినియోగదారులు తమ పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోవడం, తమకు తెలియని కనెక్షన్లు ఉంటే వెంటనే వాటిపై చర్య తీసుకోవడం మంచిది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement