Bank Strike Deferred: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె వాయిదా.. నేటి నుంచి యథావిధిగా బ్యాంకుల సేవలు

సెప్టెంబర్ 28 నుండి 30 వరకు నిర్వహించాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె వాయిదా పడటంతో దేశంలోని ఖాతాదారులకు తీవ్ర ఊరట లభించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతినిధుల మధ్య ఆదివారం రాత్రి (సెప్టెంబర్ 27) జరిగిన అత్యవసర చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Banks merge (Photo-ANI)

Bank Strike Deferred: సెప్టెంబర్ 28 నుండి 30 వరకు నిర్వహించాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె వాయిదా పడటంతో దేశంలోని ఖాతాదారులకు తీవ్ర ఊరట లభించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతినిధుల మధ్య ఆదివారం రాత్రి (సెప్టెంబర్ 27) జరిగిన అత్యవసర చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో సోమవారం (సెప్టెంబర్ 28) నుంచి బ్యాంకు శాఖలు సాధారణ వేళల్లోనే పనిచేస్తాయని, సేవలన్నింటికీ ఎలాంటి అంతరాయం ఉండదని యుఎఫ్ బి యు సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30న అర్ధవార్షిక ఆర్థిక ముగింపు (Half-yearly financial closing) ఉన్న నేపథ్యంలో ఈ సమ్మె వాయిదా పడటం బ్యాంకింగ్ రంగానికి, సాధారణ ప్రజలకు ఊరటనిచ్చే అంశం.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే పండగ.. సెప్టెంబర్ 25నే అకౌంట్లోకి జీతాలు..బ్యాంక్ సమ్మె నేపథ్యంలో కేంద్రం నిర్ణయం..

చర్చల్లోని కీలక పురోగతి & డిమాండ్లు:

1. 5 రోజుల బ్యాంకింగ్ వారం (All Saturdays Holiday):

నెలలోని అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌పై IBA స్పందించింది.

ఈ అంశాన్ని పరిశీలించేందుకు IBA, UFBU లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ప్రస్తుత వర్కింగ్ షెడ్యూలే కొనసాగుతుంది.

2. పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు (PLI):

స్కేల్ IV మరియు అంతకంటే పైస్థాయి అధికారుల 'పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్' (PLI) విధానంలో సవరణలు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేందుకు IBA అంగీకరించింది.

3. పెన్షన్, ఇతర డిమాండ్లు:

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నుండి పాత పెన్షన్ పథకానికి (OPS) మారే అవకాశం కల్పించడం, పెంపొందించిన పెన్షన్ ప్రయోజనాలు మరియు పెన్షనర్లకు ఒకే రకమైన డిఏ (DA) విధానం వంటి అంశాలపై చర్చలు ముందుకు సాగనున్నాయి.

బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు యాజమాన్యం సిద్ధమవడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు యూనియన్లు తెలిపాయి. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా 5 రోజుల బ్యాంకింగ్ వారంపై తదుపరి స్పష్టత రానుంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement