Amrit Bharat Trains: దేశవ్యాప్తంగా 7 కొత్త 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్' రైళ్లు.. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే ట్రైన్ల వివరాలు ఇవే..

దేశవ్యాప్తంగా రైలు అనుసంధానాన్ని మరింత విస్తరించడంలో భాగంగా రైల్వే బోర్డు (RB) ఒకేసారి 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లకు ఆమోదం తెలిపింది. తక్కువ, దిగువ-మధ్య ఆదాయ వర్గాల ప్రయాణికులకు అందుబాటు ధరలోనే వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణ సేవలను అందించేందుకు ఈ రైళ్లను ప్రత్యేకంగా రూపొందించారు.

Amrit Bharat Express (Photo-ANI)

Amrit Bharat Trains: దేశవ్యాప్తంగా రైలు అనుసంధానాన్ని మరింత విస్తరించడంలో భాగంగా రైల్వే బోర్డు (RB) ఒకేసారి 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లకు ఆమోదం తెలిపింది. తక్కువ, దిగువ-మధ్య ఆదాయ వర్గాల ప్రయాణికులకు అందుబాటు ధరలోనే వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణ సేవలను అందించేందుకు ఈ రైళ్లను ప్రత్యేకంగా రూపొందించారు. అత్యాధునిక వందే భారత్ రైళ్ల తరహాలోనే ప్రయాణ అనుభవాన్ని ఇవి అందిస్తాయని.. అయితే ఛార్జీలు మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది.

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా.. 2026లో భారత్‌లోని టాప్ 5 జాబ్ సెర్చ్ యాప్స్ ఇవే

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు సంబంధించిన రూట్లు, రైలు నంబర్లు, వాటి ప్రధాన స్టాప్‌ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

1. ధన్‌బాద్ – కోయంబత్తూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం: 22363/22364)

ఈ రైలు జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరు వరకు ప్రయాణిస్తుంది. తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మంతో పాటు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, కాట్పాడి, సేలం, ఈరోడ్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

2. ప్రయాగ్‌రాజ్ – లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) (ట్రైన్ నెం: 20436/20435)

ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి ప్రయాణించే వారికోసం ఈ వారపు సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది ప్రయాగ్‌రాజ్, సత్నా, జబల్‌పూర్, ఇటార్సీ, భుసావల్ మరియు కళ్యాణ్ స్టేషన్లలో ఆగుతుంది.

3. ప్రయాగ్‌రాజ్ – ఉద్నా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం: 20437/20438)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి గుజరాత్‌లోని ఉద్నా వరకు నడిచే ఈ వారపు రైలు ఫతేపూర్, గోవింద్‌పురి, ఇటావా, తుండ్లా, ఆగ్రా, కోట, రత్లాం మరియు వడోదర వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

4. సుబేదర్‌గంజ్ – లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) (ట్రైన్ నెం: 14121/14122)

ఈ వారపు రైలు సుబేదర్‌గంజ్ నుండి ప్రారంభమై ఫతేపూర్, గోవింద్‌పురి, బందా, సత్నా, మైహర్, జబల్‌పూర్, ఇటార్సీ, భుసావల్, నాసిక్ రోడ్, కళ్యాణ్ మరియు థానే స్టేషన్ల మీదుగా ముంబై ఎల్‌టీటీ చేరుకుంటుంది.

5. గోరఖ్‌పూర్ – ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం: 15095/15096)

దేశ రాజధాని ఢిల్లీని గోరఖ్‌పూర్ తో అనుసంధానించే ఈ ప్రతిపాదిత వారపు సర్వీసు ఖలీలాబాద్, బస్తీ, గోండా, సీతాపూర్, బరేలీ, మొరాదాబాద్ మరియు ఘజియాబాద్ లలో ఆగుతుంది.

6. గోరఖ్‌పూర్ – బాంద్రా టెర్మినస్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం: 15085/15086)

గోరఖ్‌పూర్ నుంచి ముంబైలోని బాంద్రా వరకు ప్రయాణించే ఈ రైలు గోండా, ఐష్‌బాగ్, కాన్పూర్ సెంట్రల్, తుండ్లా, ఆగ్రా ఫోర్ట్, కోట, రత్లం, వడోదర, సూరత్, వాపి మరియు బోరివలిల మీదుగా సాగుతుంది.

7. చర్లపల్లి – గోరఖ్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం: 22075/22076)

హైదరాబాద్ (చర్లపల్లి) వాసులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ ప్రతిపాదిత రైలు చర్లపల్లి నుంచి ప్రారంభమై కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ సెంట్రల్, ఐష్‌బాగ్, లక్నో, గోండా మీదుగా గోరఖ్‌పూర్ చేరుకుంటుంది.

ఈ కొత్త సర్వీసుల వల్ల సామాన్య ప్రయాణికులకు, సుదూర ప్రాంతాలకు వెళ్లే కూలీలు, ఉద్యోగులకు తక్కువ వ్యయంలో సురక్షితమైన ప్రయాణం లభిస్తుందని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement