RBI Action on Paytm: పేటీఎం కస్టమర్లకు బిగ్ అలర్ట్.. పేమెంట్స్ బ్యాంక్‌ లైసెన్స్ రద్దు తర్వాత RBI కీలక చర్య.. షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి తొలగింపు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దేశంలో గుర్తింపు పొందిన షెడ్యూల్డ్‌ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)ను అధికారికంగా తొలగించింది.

Paytm Payments Bank (Photo Credit: X/ @ANI)

RBI Action on Paytm: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దేశంలో గుర్తింపు పొందిన షెడ్యూల్డ్‌ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)ను అధికారికంగా తొలగించింది. నిబంధనలను నిరంతరం ఉల్లంఘించడం, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించే రీతిలో కార్యకలాపాలు సాగించడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పీపీబీఎల్‌ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేసింది. లైసెన్స్ రద్దు అనంతర పరిణామాలలో భాగంగానే, ఆర్‌బీఐ చట్టం 1934లోని రెండో షెడ్యూల్‌ నుంచి సదరు బ్యాంక్ పేరును తొలగిస్తూ కేంద్ర బ్యాంకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.  UPI MDR ఛార్జీ తప్పించుకోవచ్చా.. రూ.20,000 బిల్లును 10 పేమెంట్లుగా చెల్లిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..

బ్యాంకింగ్ వ్యవస్థలో క్రమశిక్షణ, డిపాజిటర్ల భద్రత ప్రాధాన్యంగా ఆర్‌బీఐ ఈ కొరడా ఝళిపించింది. లైసెన్స్ రద్దు తర్వాత పీపీబీఎల్‌ను పూర్తిగా మూసివేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ చట్టం రెండో షెడ్యూల్ నుంచి పీపీబీఎల్‌ను మినహాయిస్తూ జూలై 31న అంతర్గత నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర బ్యాంక్, సెప్టెంబర్ నెలలో దీనికి సంబంధించి అధికారిక గెజిట్‌ను విడుదల చేసినట్లు స్పష్టం చేసింది.

సాధారణంగా ఆర్‌బీఐ చట్టం 1934లోని రెండో షెడ్యూల్‌లో చోటు దక్కించుకున్న బ్యాంకులు మాత్రమే కేంద్ర బ్యాంకు నిర్దేశించిన కఠిన ఆర్థిక ప్రమాణాలను అందుకున్న అధికారిక షెడ్యూల్డ్ బ్యాంకులుగా గుర్తింపు పొందుతాయి. ఆ జాబితా నుంచి తొలగించబడటంతో పీపీబీఎల్‌ బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అన్ని రకాల అధికారిక హోదాలను , సదుపాయాలను శాశ్వతంగా కోల్పోయినట్లయింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement