Allu Arjun Promises David Warner: డేవిడ్ వార్న‌ర్ కు అల్లు అర్జున్ ప్రామిస్, పుష్ప స్టెప్ నేర్పిస్తానంటూ పోస్ట్, వైర‌ల్ గా మారిన కామెంట్

తాజాగా డేవిడ్‌ వార్నర్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వ‌స్తున్న చిత్రం పుష్ప 2(Pushpa 2). బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ పుష్పకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

Allu Arjun and David Warner (Photo Credit: X/Instagram)

Hyderabad, May 02: ఆస్ట్రేలియా బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్ (David Warner) గురించి తెలుగు వారికి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టును 2016లో విజేత‌గా నిల‌ప‌డ‌మే కాకుండా తెలుగువారి హృద‌యాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇక క‌రోనా లాక్‌డౌన్ టైంలో టాలీవుడ్ మూవీస్ నుంచి డేవిడ్ భాయ్ (David Warner) చేసిన రీల్స్, టిక్ టాక్ వీడియోలు ఫుల్ వైర‌ల్‌గా మారాయి. దీంతో అప్ప‌ట్లో డేవిడ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌మ‌ని ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు. ఇక రీసెంట్‌గా ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళితో క్రెడ్ యాడ్ చేసి న‌వ్వులు పూయించాడు. తాజాగా డేవిడ్‌ వార్నర్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వ‌స్తున్న చిత్రం పుష్ప 2(Pushpa 2). బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ పుష్పకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుక‌గా ఆగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ వేగం పెంచారు. తాజాగా మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప’ (Pushpa Pushpa) అనే పాట‌ను విడుద‌ల చేశారు. అయితే ఈ సాంగ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే ఈ పాట‌లో హుక్‌ స్టెప్‌ను అల్లు అర్జున్ త‌న ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయ‌గా ఫుల్ వైర‌ల్‌గా మారింది. తాజాగా ఈ హుక్‌ స్టెప్‌పై డేవిడ్‌ వార్నర్ కామెంట్ పెట్టాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

ఈ స్టెప్ ఎంత బాగుందో.. ఇప్పుడు నాకు మళ్లీ పని పడింది. దీన్ని తొంద‌రగా నేర్చుకోవాలి అంటూ డేవిడ్ భాయ్ కామెంట్ పెట్టారు. అయితే ఈ కామెంట్‌కు అల్లు అర్జున్ ఫ‌న్నీగా రిప్ల‌య్ ఇచ్చాడు. ఇది చాలా ఈజీ డేవిడ్ ఈసారి మనం కలిసినప్పుడు నేను నేర్పిస్తాను అంటూ రాసుకోచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ తెగ వైర‌ల్‌గా మారాయి. ఇక ఇవి చూసిన ఫ్యాన్స్.. పుష్ప 2లో డేవిడ్ కామియో రోల్ పెట్టించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement