Arbaaz Khan Weds Sshura Khan: మేక‌ప్ ఆర్టిస్ట్ ను పెళ్లిచేసుకోబోతున్న సల్మాన్ ఖాన్ సోద‌రుడు, త‌న‌కంటే 22 ఏళ్ల చిన్న‌దైన యువ‌తితో అర్బాజ్ ప్రేమాయ‌ణం

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తమ్ముడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్ పెళ్లిపీటలెక్కుతున్నారు. డిసెంబర్ 24 న ముంబయిలో వీరి వివాహం జరగబోతోంది. అర్బాజ్ ఖాన్‌కి ఇది రెండో పెళ్లి. 1998 లో నటి మలైకా అరోరాను (Malika Arora) పెళ్లాడిన అర్బాజ్ 19 సంవత్సరాల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పి 2017 లో విడాకులు తీసుకున్నారు

Arbaaz Khan Weds Sshura Khan: మేక‌ప్ ఆర్టిస్ట్ ను పెళ్లిచేసుకోబోతున్న సల్మాన్ ఖాన్ సోద‌రుడు, త‌న‌కంటే 22 ఏళ్ల చిన్న‌దైన యువ‌తితో అర్బాజ్ ప్రేమాయ‌ణం
Arbaaz Khan and Sshura Khan (Photo Credits: Instagram)

Mumbai, DEC 21: బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను (Sshura Khan) పెళ్లాడబోతున్నారు. డిసెంబర్ 24 న వీరి వివాహం జరగనుంది. ముంబయిలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ జంట ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తమ్ముడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్ పెళ్లిపీటలెక్కుతున్నారు. డిసెంబర్ 24 న ముంబయిలో వీరి వివాహం జరగబోతోంది.

Eagle Trailer: విషం మింగుతాను అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ ఈగల్‌ ట్రైలర్, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల 

అర్బాజ్ ఖాన్‌కి ఇది రెండో పెళ్లి. 1998 లో నటి మలైకా అరోరాను (Malika Arora) పెళ్లాడిన అర్బాజ్ 19 సంవత్సరాల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పి 2017 లో విడాకులు తీసుకున్నారు. కాగా ‘పట్నా శుక్లా’ సినిమా షూట్ సమయంలో పరిచయం అయిన షురా ఖాన్‌ను అర్బాజ్ పెళ్లి చేసుకుంటున్నారు.

Salaar First Review from UAE: సలార్ సెన్సార్ రివ్యూ ఇచ్చేసిన ఉమేర్ సంధు, సినిమాలో మూడు పాత్రలు చాలా గట్టిగా పని చేస్తాయంటూ ఏకంగా 4/5 రేటింగ్ 

మలైకాతో విడిపోయిన తర్వాత అర్బాజ్ (Arbaaz Khan) తనకంటే చాలా చిన్నదైన నటి, మోడల్ జార్జియా ఆండ్రియాతో చాలా కాలంగా  డేటింగ్‌లో ఉన్నారు. అయితే వీరిద్దరు విడిపోయారు. ఈ విషయాన్ని జార్జియా ధృవీకరించింది.  అయితే ప్రస్తుతం అర్బాజ్ పెళ్లి చేసుకుంటున్న షురా ఖాన్ మేకప్ ఆర్టిస్ట్‌గా తెలుస్తోంది. వీరిద్దరికీ కూడా 22 సంవత్సరాల గ్యాప్ ఉందట. కాగా షురా ఖాన్ గతంలో రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని వద్ద ఆమె పనిచేసింది. వీరిద్దరికీ ‘పట్నా శుక్లా’ మూవీ షూట్‌లో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది.

(The above story first appeared on LatestLY on Dec 21, 2023 11:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).