కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా సలార్ . ఈ సినిమా గురించి రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్.. కెజీఎఫ్, కెజీఎఫ్ 2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీసుల్ని షేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదే క్రమంలో, అదే స్పీడ్ లో ఇప్పుడు ఈ సినిమాను కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో దుబాయ్ సెన్సార్ బోర్డులో సభ్యుడిని చెప్పుకుంటున్న ఉమేర్ సంధు అన్ని సినిమాలకు ఇస్తున్నట్లుగానే ఈ సినిమాకు కూడా రివ్యూ ఇచ్చేశాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఈ సినిమాలో మూడు పాత్రలు చాలా గట్టిగా పని చేస్తాయి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రలో ప్రభాస్ నటించని విధంగా కనిపించడమే కాకుండా.. యాక్షన్స్ అన్నివేశాల్లో ఇరగదీసాడు అని చెప్పాడు. మాస్ పాత్రలు వేయాలంటే ప్రభాస్ మాత్రమే బాస్ అనే రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చాడని ఉమేర్ సంధు తెలిపాడు.
ఈ సినిమా చూస్తే ప్రభాస్ ని మించిన మాస్ హీరో ఎవరు లేరని అనిపిస్తుందని, ఒక రేంజ్ లో ప్రభాస్ ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేశాడని, చాలా అద్భుతంగా నటించాడని, ప్రభాస్ నటనకు ఎక్కడా కూడా రిమార్కబుల్ అనేదే ఉండదని.. ఉమేర్ సంధు ఈ రివ్యూ లో చెప్పాడు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు శృతిహాసన్ కూడా చాలా బాగా నటించిందని, ఆమె పాత్ర ఆమె నటన అందరిని ఆకట్టుకుంటుందని, పృథ్విరాజ్ సుకుమార్ పాత్రలు కూడా బలంగా ఉన్నాయని, పృథ్వీరాజ్ కుమార్ యాక్టింగ్ అదిరిపోతుందని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాకి ఉమేర్ సంధు 4/5 రేటింగ్ ఇచ్చాడు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇతని రివ్యూ హిట్టా ఫట్టా అనేది చూడాలి.