Bigg Boss Telugu Season 5: బిగ్‌బాస్‌ షోకు ఓ దండం, నాకు ఆ షో నచ్చదన్న లోబో, నేడు అదే హౌస్‌లో వెరైటీ మ్యాన్, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

తెలుగు రియాల్టీ షో ఐదో సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి విదితమే. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వరుసగా మూడోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా చెప్పిన ప్రకారం..సెప్టెంబర్ 05వ తేదీ ఆదివారం బుల్లితెరపై ‘బిగ్ బాస్ 5’ (Bigg Boss Telugu Season 5) సందడి సందడిగా ప్రారంభమైంది.

Contestant Lobo (Photo-Star maa/Twitter)

తెలుగు రియాల్టీ షో ఐదో సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి విదితమే. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వరుసగా మూడోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా చెప్పిన ప్రకారం..సెప్టెంబర్ 05వ తేదీ ఆదివారం బుల్లితెరపై ‘బిగ్ బాస్ 5’ (Bigg Boss Telugu Season 5) సందడి సందడిగా ప్రారంభమైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు. ఆరో కంటెస్టెంట్ గా ‘లోబో’ వచ్చాడు. వెరైటీగా కనిపించే ఈ లోబో (Contestant Lobo) కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

బిగ్‌బాస్‌ షో చూస్తుంటారా? మీ అభిప్రాయం ఏంటి అని గతంలో ఓ యాంకర్‌ ప్రశ్నించగా..'బిగ్‌బాస్‌ షోకు ఓ దండం. అది నా టేస్ట్‌ కాదు. షోలో చాన్స్‌ రావకపోడమే మంచిది. నాకు ఆ షో నచ్చదు' అంటూ లోబో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాన్స్‌ రానంత వరకు బిగ్‌బాస్‌ షోను తిట్టడం, ఆ తర్వాత ఇలా ప్లేటు మార్చడంతో లోబోపై నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు.

చిన్నప్పటి నుంచి తనకు ఇలాగే ఉండడం ఇష్టమని, తన గురించి తండ్రిని తిట్టేవారని తెలిపాడు. ప్రతి శుక్రవారం తాను నాన్న సమాధి దగ్గరకు వెళుతానని, నాన్న ఉన్నప్పుడు విలువ ఇవ్వలేదని..ఇప్పుడా ఆ విలువ తెలుస్తోందని ఎమోషనల్ అయ్యాడు. ఇక కట్టుబొట్టు, మాట తీరుకు తోడు హైదరాబాదీ యాసలో యాంకరింగ్‌ చేస్తూ జనాలను అలరించే లోబో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంత మేర అలరిస్తాడన్నది చూడాల్సి ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement