Kaikala Satyanarayana: కరోనా కారణంగా ఆయన బలహీనం అయ్యారు: కైకాల సత్యనారాయణ సోదరుడు

తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన కైకాల సత్యనారాయణ మృతి వార్తతో ఇరు తెలుగు రాష్ట్రాలు దిగ్భాంతికి గురయ్యాయి. కైకాల సత్యనారాయణ సోదరుడు, నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ, శీతాకాలంలో శ్వాస తీసుకోవడంలో అన్నయ్య ఇబ్బంది పడుతుంటారని... ఇటీవల కూడా అదే కారణంతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు.

Kaikala Satyanarayana: కరోనా కారణంగా ఆయన బలహీనం అయ్యారు: కైకాల సత్యనారాయణ సోదరుడు
Credits: Twitter

Hyderabad, Dec 23: తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) మృతి వార్తతో ఇరు తెలుగు రాష్ట్రాలు (Telugu States) దిగ్భాంతికి గురయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మరోవైపు కైకాల సత్యనారాయణ సోదరుడు, నిర్మాత నాగేశ్వరరావు (Nageswara Rao ) మాట్లాడుతూ, శీతాకాలంలో శ్వాస తీసుకోవడంలో అన్నయ్య ఇబ్బంది పడుతుంటారని... ఇటీవల కూడా అదే కారణంతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు.

నవరస నటనాసార్వభౌమా నువ్వు ఇక రావా.. నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

కొంత కాలంగా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ తెల్లవారుజామున ఇంట్లోనే తుదిశ్వాస విడిచారని చెప్పారు. గత ఏడాది కరోనా బారిన పడి చాలా బలహీనంగా అయ్యారని తెలిపారు. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని మా అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉంచనున్నారు.

విజయ్ దేవరకొండపై క్రష్ ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా

(The above story first appeared on LatestLY on Dec 23, 2022 10:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).