Credits: Instagram

Hyderabad, Dec 23: ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ (Unstoppable)తో బాలకృష్ణ (Balakrishna) దూసుకుపోతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల అభిరుచులను ఆవిష్కరిస్తూ పూర్తిగా ఎంటర్టైన్ మెంట్ తో కొనసాగుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ షో సీజన్ 2 కొనసాగుతోంది.

నవరస నటనాసార్వభౌమా నువ్వు ఇక రావా.. నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించిన బాలయ్య... వారి నుంచి ఆసక్తికర విషయాలను రాబట్టారు. తాజాగా అలనాటి అందాల తారలైన జయప్రద (Jayaprada), జయసుధలతో (Jayasudha) పాటు యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Rashikhanna)లతో అన్ స్టాపబుల్ షోను బాలయ్య నిర్వహించారు.

అస్కార్ బరిలో RRR మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకున్న నాటు నాటు సాంగ్, విశ్వవ్యాప్తమైన తెలుగు సినిమా ఖ్యాతి

ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా నుంచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య రాబట్టారు. టాలీవుడ్ హీరోల్లో నీకు ఎవరిపై క్రష్ ఉందని బాలయ్య అడగ్గా... ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అని రాశి సమాధానం ఇచ్చింది.