
Hyderabad, DEC 22: బాహుబలితో విశ్వవ్యాప్తం అయిన తెలుగు సినిమా ఖ్యాతీ...ఇప్పుడు RRR మూవీతో మరింత పెరిగింది. వందలకోట్ల కలెక్షన్లు మాత్రమే కాదు, అనేక అంతర్జాతీయ అవార్డులు, కోట్లాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుని RRR మూవీ వరల్డ్ వైడ్‌గా మంచిపేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీకి మరో ఖ్యాతి దక్కింది. 95వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌లో (Oscar Nominations) షార్ట్‌లిస్ట్ జాబితాలో (Oscars 2023 Shortlists) చోటుదక్కించుకున్నది. పది విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాల జాబితాను అకాడమీ గురువారం ప్రకటించింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRRలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు స్థానం దక్కింది.
Most celebrated - Naatu Naatu is the first Indian song to be listed in Oscar’s Shortlist. Let’s hope for final nomination ?#RRRForOscars #NaatuNaatuForOscars #RRRMovie @TheAcademy pic.twitter.com/JcUEHO2y6u
— NTR FANS USA (@NTRFans_USA) December 21, 2022
దీంతోపాటు మరో భారతీయ సినిమా ‘ది లాస్ట్ ఫిల్మ్ షో’ (చెల్లో షో) బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో చోటు సంపాదించింది. వీఎఫ్ఎక్స్ (VFX), సౌండ్ డిజైనింగ్ విభాగాల్లో కూడా RRR షార్ట్‌లిస్ట్‌కు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే మన దేశానికి చెందిన ఏ సినిమాకు ఇందులో చాన్స్ దక్కలేదు.
కాగా, ఆస్కార్‌కు పోటీపడుతున్న మొత్తం 81 ట్యూన్స్ నుంచి 15 పాటలను షార్ట్ లిస్ట్ చేశారు. వాటిలో నాటు నాటుతోపాటు అవతార్-2లోని నథింగ్ ఈ లాస్ట్, బ్లాక్ పాంథర్‌లోని లిఫ్ట్ మీ అప్, టాప్ గన్ సినిమాలోని హోల్డ్ మై హాండ్ వంటి పాటలు ఉన్నాయి. ఈ 15 సినిమాల్లో ఐదు మూవీస్‌ను జనవరిలో ఆస్కార్‌కు నామినేట్ చేస్తారు. ఆ సిని మాలు మాత్రమే ఆస్కార్‌కు పోటీపడతాయి. మార్చి 12న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు.