Credits: Twitter

Hyderabad, Dec 23: నవరస నటనాసార్వభౌముడిగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Tollywood senior actor Kaikala Satyanarayana) (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలింనగర్‌లోని (Filmnagar) తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా(Krishna District) గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు.

బయటి దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేయండి.. ఆరోగ్య శాఖ కరోనా తాజా మార్గదర్శకాలు

విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌమగా పేరుగాంచారు. కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 60 ఏళ్ళ నటప్రస్థానంలో పౌరాణికం, జానపదం, సాంఘీకం, యాక్షన్ ఇలా  777 సినిమాలకు పైనే నటించారు. ముఖ్యంగా యుముడి పాత్రతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.

భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ కు కేంద్రం ఆమోదం, వచ్చే వారం నుంచి 18 ఏళ్లు దాటిన వారికి ముక్కు ద్వారా చుక్కల మందు పంపిణీ చేసే అవకాశం..