Shock to Hero Nagarjuna: హీరో నాగార్జునకు హైడ్రా షాక్.. మాదాపూర్‌ లోని ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్ ను కూల్చేస్తున్న అధికారులు.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు.. చెరువును కబ్జా చేసి నిర్మించడమే కారణం.. (వీడియో)

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్‌ లోని ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

Shock to Hero Nagarjuna (Credits: FB)

Hyderabad, Aug 24: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు (Hero Nagarjuna) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్‌ లోని ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నది. మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను కబ్జా చేసి నాగార్జున ఎన్‌-కన్వెన్షన్‌ హాల్‌ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైనా ఫిర్యాదులు  వచ్చాయి. దీంతో ఎన్-కన్వెన్షన్ నిర్మాణం అక్రమమని తేల్చిన అధికారులు నేటి ఉదయం కూల్చివేత పనులు ప్రారంభించారు.

ఫెమినా మిస్ ఇండియా పోటీల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్ర‌కృతి కంభం.. మిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ గా భ‌వ్యారెడ్డి

గతంలో ఆగిపోయి..

హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. నగరంలో ఆక్రమణల తొలిగింపు పైన దూకుడుగా వ్యవహరిస్తున్నది. . కేటీఆర్‌ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. కాగా, నాగార్జున  ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ పై గతంలోనే ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నా..అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగినా..చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి.

భార‌త్ ఎప్పుడూ త‌ట‌స్థం కాదు! ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు నేను మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తా! ఉక్రెయిన్ ప‌ర్య‌ట‌న‌లో మోదీ కీల‌క వ్యాఖ్య‌లు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement