AP Minister Roja: ఏపీ మంత్రి రోజాకు ఘోర అవమానం, స్టేజీ మీద అందరూ చూస్తుండగానే, మెడలోని దండ విసిరికొట్టి ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు..ఏం జరిగింది..

జబర్దస్త్ ద్వారా ఎంతో సేమ్ సంపాదించుకున్నా మంత్రి రోజా ఎట్టకేలకు మరోసారి ఈటీవీలో కనిపించారు ఈసారి దసరా సందర్భంగా రూపొందించిన ప్రత్యేక ఈవెంట్ లో మంత్రి రోజా తళుక్కుమన్నారు.

(Image: Minister Roja, Youtube Screen Shot)

జబర్దస్త్ ద్వారా ఎంతో సేమ్ సంపాదించుకున్నా మంత్రి రోజా ఎట్టకేలకు మరోసారి ఈటీవీలో కనిపించారు ఈసారి దసరా సందర్భంగా రూపొందించిన ప్రత్యేక ఈవెంట్ లో మంత్రి రోజా తళుక్కుమన్నారు. నిజానికి ఎమ్మెల్యే కాక ముందు నుంచే రోజా మల్లెమాల నిర్మించిన జబర్దస్త్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. 2014లో ఎమ్మెల్యే అయినప్పటికీ రోజా జబర్దస్త్ వదలలేదు. ఇక 2019లో రెండోసారి కూడా ఎమ్మెల్యే అయినప్పటికీ జబర్దస్త్ లో కొనసాగారు. ఆ సమయంలోనే ఆమె ఏపీఐఐసీ చైర్మన్గా బాధ్యతలు వ్యవహరించారు. అయినప్పటికీ జబర్దస్త్ లోనే కొనసాగారు.

ఇక తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ విడిచి పెట్టాల్సి వచ్చింది. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత దసరా ఈవెంట్ సందర్భంగా కేవలం ఒకే ఎపిసోడ్లో కనిపించేందుకు రోజా ఈటీవీలో కనిపించారు. దసరా సందర్భంగా రూపొందించిన ఈ ప్రత్యేక ఈవెంట్ లో జబర్దస్త్ టీమ్ మొత్తం కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా హైపర్ ఆది, గెటప్ శీను ఆటో రాంప్రసాద్ తమ పంచులతో ఈవెంట్ ను రక్తికట్టించారు.

ఎమ్మెల్యే రోజా కూడా ఈ ఈవెంటులో తనదైన శైలిలో రివర్స్ పంచులు వేశారు. హైపర్ ఆది, రామ్ ప్రసాద్‌లకు కౌంటర్లు వేశారు. ఈవెంటులో ఉన్నవారిలో ఎవరికి ఏ మంత్రి శాఖలు సెట్ అవుతాయని మంత్రి రోజాను హైపర్ ఆది ఓప్రశ్న అడగినప్పుడు.. ఒక్కొక్కరికి ఆమె ఒక్కో శాఖ ఇచ్చింది. శ్రీముఖికి టూరిజం శాఖ ఇస్తానని.. ఎందుకంటే అన్ని ఛానెల్స్‌కు టూర్ వేస్తుందని పంచ్ వేశారు. ఇక హైపర్ ఆదికి ఆహార మంత్రి శాఖ ఇస్తానని.. ఈ మధ్య ఆది ఆకలి గురించి బాగా విన్నానని అన్నారు.

కోస్తాంధ్ర,రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు, మరో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు

అయితే ఈ సందర్భంగా మంత్రి రోజాకు దసరా ఈవెంటులో అవమానం జరిగినట్లు తెలుస్తోంది. ఆమెకు సన్మానం చేస్తున్న సమయంలో ఆర్టిస్ట్ నూకరాజు చేసిన పనికి మంత్రి రోజా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. అసలు నన్ను పిలిచింది అవమానించడానికా..' అని మంత్రి రోజా హైపర్ ఆది, ఇంకా నూకరాజుపై సీరియస్ అయ్యారు. 'మీరంతా ప్లాన్ చేసుకుని నన్ను రమ్మన్నారా..?' అంటూ కంటతడి పెట్టుకుని రోజా వెళ్లిపోయారు.

అయితే నూకరాజు మంత్రి రోజాను స్టేజి మీదనే నిలదీశాడు. మీరు గతంలో జబర్దస్త్ వదిలి వెళ్లడం ఇష్టం లేదన్నారు. అయిపోగానే వదిలేసి వెళ్లిపోయారు. దీన్ని ఏమనుకోవాలి అంటూ నిలదీశాడు. దీంతో మంత్రి రోజా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. అయితే ఇదే ఎప్పటిలాగే టిఆర్పీ కోసం చేసిన అని అంతా అనుకున్నారు. కానీ మంత్రి రోజా నిజంగానే ఎమోషనల్ అయ్యారు. యాంకర్ శ్రీముఖి, అలాగే హైపర్ ఆది బతిమిలాడిన తర్వాతే ఆమె సెట్ అయ్యారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement