James Bond Movies Offer: ఆ సినిమాలు చూస్తే రూ.72 వేలు మీ చేతికి, జేమ్స్ బాండ్ సినిమాలపై బంపరాఫర్ ప్రకటించిన NerdBear.com అనే వెబ్‌సైట్, అయితే ఇండియన్లకు నో ఛాన్స్, కేవలం యూఎస్ లో నివాసం ఉండే వారికి మాత్రమే

జేమ్స్ బాండ్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ నుంచి నెక్ట్స్ వెర్షన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు (James Bond Fans) ఎంతో ఆత్రంగా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అభిమానులకు సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. 30 రోజుల్లో 24 జేమ్స్బాండ్ సినిమా సీరిస్‌లు ( James Bond Movies Offer) చూస్తే.. రూ. 73 వేలు మన ఖాతాలో జమవుతాయి. NerdBear.com అనే వెబ్‌సైట్ ఈ ప్రత్యేక ఆఫర్ ని ప్రకటించింది.

Daniel Craig as 007 agent (Photo Credits: Instagram)

జేమ్స్ బాండ్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ నుంచి నెక్ట్స్ వెర్షన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు (James Bond Fans) ఎంతో ఆత్రంగా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అభిమానులకు సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. 30 రోజుల్లో 24 జేమ్స్బాండ్ సినిమా సీరిస్‌లు ( James Bond Movies Offer) చూస్తే.. రూ. 72 వేలు మన ఖాతాలో జమవుతాయి. NerdBear.com అనే వెబ్‌సైట్ ఈ ప్రత్యేక ఆఫర్ ని ప్రకటించింది.

ఎన్‌ఈఆర్‌డీబీఈఏఆర్.కామ్ అనే వెబ్‌సైట్ పొందుపరిచిన వివరాల ప్రకారం 1962 నాటి ’డాక్టర్ నో’ నుంచి మొదలుకుని 2015 లో విడుదలైన స్పెక్ట్రే వరకు మొత్తం 24 సినిమాలను చూడాలి. ఈ ఏడాది సెప్టెంబరు 30 న జేమ్స్ బాండ్ సీరిస్‌లో 25 వ సినిమా... ‘నో టైం టు డై’ (No Time To Die) విడుదల కానుంది. వాస్తవానికి ‘నో టైమ్ టు డై’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ... కరోనా నేపధ్యంలో సినిమా సెప్టెంబరుకు వాయిదా పడింది. జేమ్స్‌బాండ్ సీరిస్‌ను చూసేందుకు ఎంపికయ్యే అభ్యర్థి ఆ మూవీ విడుదలకు ముందే గత 24 చిత్రాలు చూసేయాలి.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా..బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్‌కు కరోనా, నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలని ట్వీట్, దేశంలో తాజాగా 62,258 మందికి కరోనా నిర్ధారణ

చూసిన విజేతకు వెయ్యి డాలర్ల(భారత కరెన్సీలో సుమారు రూ. 72 వేలు)తో పాటు సినిమాలు చూసేందుకు వెయ్యి డాలర్ల అమెజాన్ గిఫ్ట్ కార్డు, త్వరలో విడుదలయ్యే తాజా జేమ్స్ బాండ్ సినిమా చూసేందుకు 50 డాలర్ల ఏఎంసీ గిఫ్ట్ కార్డు ఇవ్వనున్నారు. జేమ్స్ బాండ్ సినిమాలంటే ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు ప్రకటించారు. గత 24 సినిమాలన్నీ కలిపితే మొత్తం నిడివి 51 గంటలుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by James Bond 007 (@007)

అయితే ఇది ఇండియన్లకు కాదు.. జాతీయత ప్రమాణాలకు సంబంధించినంతవరకు, దరఖాస్తుదారుడు యుఎస్ పౌరుడు అయి ఉండాలి. యునైటెడ్ స్టేట్స్ యొక్క శాశ్వత నివాసి అయి ఉండాలి. పైన పేర్కొన్న అన్ని ప్రమాణాలను ఒకరు సంతృప్తిపరిస్తే, వ్యక్తి సైట్‌లో లభించే ఉద్యోగానికి సంబంధించిన ఫారమ్‌ను పూరించవచ్చు. ప్రశ్నార్థక రూపం దరఖాస్తుదారునికి సంబంధించిన ప్రశ్నలతో పాటు ఫిల్మ్ ఫ్రాంచైజీతో పాటు, వ్యక్తి జేమ్స్ బాండ్ అభిమాని ఎందుకు అనే దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

పాల్గొనేవారు, సైట్ ప్రకారం, ఎంపిక చేసిన తరువాత, జేమ్స్ బాండ్ చలన చిత్రాల జాబితాను రూపొందించే అన్ని చిత్రాలను అద్దెకు తీసుకోవడానికి మొదట US $ 100 అమెజాన్ గిఫ్ట్ కార్డును అందుకుంటారు. వైబ్ సైట్ నిర్దేశించిన పనుల సమితి పూర్తయిన తర్వాత, నో టైమ్ టు డై చూడటానికి అది విడుదల చేసినప్పుడు, వ్యక్తి US $ 1000 మరియు US $ 50 AMC కార్డును అందుకుంటారు. కాగా నో టైమ్ టు డై రాబోయే 25 వ చిత్రం, డేనియల్ క్రెయిగ్‌ను జేమ్స్ బాండ్‌గా చివరిసారిగా చూస్తారు.

The films they will be watching are:

  1. Dr. No (1962)
  2. From Russia with Love (1963)
  3. Goldfinger (1964)
  4. Thunderball (1965)
  5. You Only Live Twice (1967)
  6. On Her Majesty’s Secret Service (1969)
  7. Diamonds Are Forever (1971)
  8. Live and Let Die (1973)
  9. The Man with the Golden Gun (1974)
  10. The Spy Who Loved Me (1977)
  11. Moonraker (1979)
  12. For Your Eyes Only (1981)
  13. Octopussy (1983)
  14. A View to a Kill (1985)
  15. The Living Daylights (1987)
  16. Licence to Kill (1989)
  17. GoldenEye (1995)
  18. Tomorrow Never Dies (1997)
  19. The World Is Not Enough (1999)
  20. Die Another Day (2002)
  21. Casino Royale (2006)
  22. Quantum of Solace (2008)
  23. Skyfall (2012)
  24. Spectre (2015)

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now