Jwala Gutta-Vishnu Vishal Engagement: గుత్తా జ్వాలతో తమిళ నటుడు విశాల్ ఎంగేజ్‌మెంట్, కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దామంటూ ట్వీట్ చేసిన విష్ణు విశాల్

గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ నిశ్చితార్థం (Jwala Gutta-Vishnu Vishal Engagement) జరిగింది. త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఇవాళ గుత్తా జ్వాల పుట్టినరోజు (Jwala Gutta Birthday) కాగా.. ఆమెకు రింగ్ తొడిగేశారు విష్ణు (Vishnu Vishal). ఈ విషయాన్ని సోషల్ మీడియాలో విష్ణు వెల్లడించారు..

Jwala Gutta gets engaged to Vishnu Vishal (Photo-Vishal Twitter)

గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ నిశ్చితార్థం (Jwala Gutta-Vishnu Vishal Engagement) జరిగింది. త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఇవాళ గుత్తా జ్వాల పుట్టినరోజు (Jwala Gutta Birthday) కాగా.. ఆమెకు రింగ్ తొడిగేశారు విష్ణు (Vishnu Vishal). ఈ విషయాన్ని సోషల్ మీడియాలో  విష్ణు వెల్లడించారు..

”హ్యాపీ బర్త్‌డే గుత్తా జ్వాల. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మంచి భవిష్యత్‌‌ కోసం, ఆర్యన్‌ కోసం‌, మన కుటుంబాల కోసం, మన స్నేహితుల కోసం పాజిటివ్‌గా ఉందాం. మీ అందరి ఆశీస్సులు కావాలి. అర్ధరాత్రి ఉంగరాన్ని అరేంజ్ చేసిన బసంత్ జైన్‌కి థ్యాంక్యు” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌ని గుత్తా జ్వాలా రీట్వీట్ చేశారు. ఇక త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన చేతన్ ఆనంద్‌ని 2005లో గుత్తా జ్వాల (Jwala Gutta) పెళ్లాడారు. ఆ తరువాత 2011లో వీరిద్దరు విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి జ్వాల సింగిల్‌గా ఉన్నారు.

Here's VISHNU VISHAL Tweet

మరోవైపు 2010లో రజనీ నటరాజ్‌ని వివాహమాడిన విష్ణు విశాల్‌, 2018లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఆర్యన్ అనే కుమారుడు ఉండగా.. ప్రస్తుతం అతడు విశాల్ సంరక్షణలో ఉన్నారు. మరోవైపు కెరీర్ విషయాల్లోకి వెళ్తే, గుత్తా జ్వాల బ్యాడ్మింటన్‌ అకాడమీని ప్రారంభించగా.. విష్ణు విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

గ‌తంలో వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవ్వ‌గా అందులో విష్ణు.. గుత్తా జ్వాల‌కు ముద్దుపెడుతున్న ఫోటో ఇంకా వైరల్ అయింది. అప్పుడే వీరిద్దరి ప్రేమాయణంపై క్లారిటీ వచ్చింది.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement