Kajal Agarwal’s Baby Shower: ఘనంగా కాజల్ సీమంతం వేడుకలు, భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి సంబరాలు చేసుకున్న చందమామ, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

ప్రస్తుతం ఎంతో సంతోషంగా కనిపిస్తోంది. నిన్న కాజల్ ఇంట్లో సీమంతం వేడుకలు ఘనంగా జరిగినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు కాజల్ తన ఇన్ స్టా స్టోరీల్లో ఫోటోలను షేర్ చేసింది.

Image Source: Instagram

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. గతేడాది ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌ గౌతమ్‌ కిచ్లూను కాజల్‌ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలను ఆచి..తూచి చేస్తుంది. ఇక తాజాగా ప్రెగ్నెన్సీ రావడంతో… పూర్తిగా సినిమాల నుంచి తప్పుకుంది హీరోయిన్ కాజల్‌. ఇక త్వరలోనే ఈ జంట తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం మాతృత్వ దశను కాజల్ ఎంజాయ్ చేస్తోంది. తల్లి కాబోతోన్న కాజల్.. ప్రస్తుతం ఎంతో సంతోషంగా కనిపిస్తోంది. నిన్న కాజల్ ఇంట్లో సీమంతం వేడుకలు ఘనంగా జరిగినట్టు కనిపిస్తోంది.

ఈ మేరకు కాజల్ తన ఇన్ స్టా స్టోరీల్లో ఫోటోలను షేర్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి కాజల్ ఆనందంగా వేడుకను సెలెబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోలను కాజల్ తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడంతోనే కొన్ని సినిమాలనుంచి తప్పుకుంది. అందులో నాగార్జున ఘోస్ట్ సినిమా కూడా ఉంది. ఇక ఆచార్య సినిమాను కాజల్ అంతకు ముందే పూర్తి చేసేసింది. మొత్తానికి కాజల్ మరో ఏడాది పాటు నటనకు దూరంగానే ఉండేట్టు కనిపిస్తోంది.

పుణేలో దారుణం, పడుకోవడానికి రాలేదని సెక్స్ వర్కర్‌పై బ్లేడుతో దాడి చేసిన విటుడు, మరో ఘటనలో ఢిల్లీలో 87 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

ఈ మధ్యే కాజల్ దుల్కర్ సల్మాన్ నటించిన హే సినామిక సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం మార్చి 3న విడుదలకు రెడీగా ఉంది. ఇక ఆచార్య అయితే ఏప్రిల్ నెలాఖరున రానుంది.