Jr NTR Fan Letter Goes Viral: నా బిడ్డ చివరి కోరిక తీర్చండి! జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమాని లెటర్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లేఖ, మరి హీరో స్పందిస్తాడా?

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు (Huzurabad Fan) చెందిన ఓ యువతి క్యాన్సర్‌తో బాధపడుతున్నది. చివరిసారిగా అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్‌ను కలవాలని ఉందని.. ఈ మేరకు ఆయనను కలిసేలా సహాయం చేయాలని మంత్రి కోమటిరెడ్డికి ఆమె తల్లి లేఖ రాసింది.

Jr NTR Fan Letter Goes Viral (PIC @ X)

Hyderabad, JAN 29: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు (NTR) యూత్‌లో భారీగానే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. ఓ వైపు సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటూనే మరో వైపు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో బెడ్‌పై ఉన్న పలువురు తమ అభిమాన నటుడిని చూడాలని, చివరిసారిగా మాట్లాడాలని ఉందంటూ తమ కోరికను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు (Huzurabad Fan) చెందిన ఓ యువతి క్యాన్సర్‌తో బాధపడుతున్నది. చివరిసారిగా అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్‌ను కలవాలని ఉందని.. ఈ మేరకు ఆయనను కలిసేలా సహాయం చేయాలని మంత్రి కోమటిరెడ్డికి ఆమె తల్లి లేఖ రాసింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో (Social Media) ట్రెండ్‌ అవుతున్నది.

Kishan Reddy Met Balakrishna: బాలకృష్ణను కలిసి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డుకు భాలయ్య పూర్తిగా అర్హులంటూ అల్లు అర్జున్ ట్వీట్ 

వివరాల్లోకి వెళితే.. హుజూరాబాద్‌కు చెందిన స్వాతి (25) అనే యువతి క్యాన్సర్‌తో పోరాడుతుందని లేఖలో ఆమె తల్లి రజిత పేర్కొంది. తన కూతురు బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతుందని.. ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడడమే తన చివరి కోరిక అని వాపోయింది. నటుడిని కలిసే అవకాశం కల్పించాలని మంత్రి కోమటిరెడ్డిని (Komati reddy) రజిత కోరింది. అయితే గతంలో కౌశిక్‌ అనే అభిమాని క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో ఎన్టీఆర్‌ వీడియోకాల్‌ చేసి ధైర్యం చెప్పాడు. అలాగే, రూ.20లక్షల ఆసుపత్రి బిల్లు సైతం భరించాడు. ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’లో నటించాడు. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో ‘వార్-2‌’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఏడాది ఆగస్టులో విడుదల కానున్నది. అలాగే, దేవర-2తో పాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement