Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: అంగరంగ వైభవంగా నాగచైతన్య, శోభిత పెళ్లి, నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya), హీరోయిన్ శోభిత ధూళిపాల (Shobjitha) పెళ్లితో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో వివాహ వేడుక వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి సరిగ్గా 8.15 గంటలకు నిర్వహించారు. పెళ్లి వేడుకకు (Naga Chaitanya Sobhita Dhulipala Marriage) ఇరు కుటుంబాలతో పాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.
Hyderabad, DEC 04: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya), హీరోయిన్ శోభిత ధూళిపాల (Shobjitha) పెళ్లితో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో వివాహ వేడుక వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి సరిగ్గా 8.15 గంటలకు నిర్వహించారు. పెళ్లి వేడుకకు (Naga Chaitanya Sobhita Dhulipala Marriage) ఇరు కుటుంబాలతో పాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు వ్యాపారవేత్త టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రాణా దగ్గుబాటి, సుహాసిని, అడవి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటితో పాటు పలువురు హాజరయ్యారు.
Naga Chaitanya and Sobhita Dhulipala Wedding Pics
ఈ సందర్భంగా ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.