Priyanka and Nick welcomes a baby: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక, సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడి, దయచేసి ప్రైవసీ పాటించాలంటూ మీడియాకు విజ్ఙప్తి

బల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రియాంక- నిక్ జోనస్ (Nick Jonas) దంపతులు సరోగసీ(surrogacy) ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించారు.

New Delhi January 22: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రియాంక- నిక్ జోనస్ (Nick Jonas) దంపతులు సరోగసీ(surrogacy) ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించారు. 'సరోగసీ(surrogacy) ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు..' అని ప్రియాంక రాసుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

తొలిసారి తల్లిదండ్రులపై ప్రియాంక చోప్రా (Priyanka Chopra) దంపతులకు సినీ సెలబ్రెటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ వచ్చిపడుతోంది. పలువురు బాలీవుడ్ యాక్టర్స్ వారిక శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. నిక్‌, ప్రియాంక 2018 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఉమైద్‌ భవన్‌ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్‌ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement