Mahesh Babu on Vinesh Phogat Disqualification: మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది, వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు

మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలబడ్డాడు. ఆమె నిజమైన ఛాంపియన్ అంటూ కొనియాడాడు. ఈ రోజు ఫలితంతో సంబంధం లేదు. మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనం. వినేశ్ ఫోగాట్‌.. మీరు నిజమైన ఛాంపియన్ అని అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో అండగా నిలవడానికి మీ దృఢత్వం, బలం అందరికి స్ఫూర్తి.

Mahesh Babu on Vinesh Phogat Disqualification

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు వినేష్ ఫోగట్‌కు అనుకూలంగా పోస్ట్‌లు పెట్టారు. సమంత, అలియా భట్, ఫర్హాన్ అక్తర్, తాప్సీ పన్ను, కరీనా కపూర్ ఖాన్ పలువురు వినేష్ ఫోగట్‌ కు ధైర్యం చెప్పారు. 'నవ్వు నిజమైన ఛాంపియన్' అంటూ సోషల్ మీడియాలో పోస్టు లు పెట్టారు. దేశం మొత్తం మీ వెంటే ఉంది వినేశ్, రాహుల్ గాంధీ ట్వీట్ ఇదిగో, నువ్వు ఎప్పుడూ దేశం గర్వించేలా చేశావంటూ విషెస్

తాజాగా మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలబడ్డాడు. ఆమె నిజమైన ఛాంపియన్ అంటూ కొనియాడాడు. ఈ రోజు ఫలితంతో సంబంధం లేదు. మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనం. వినేశ్ ఫోగాట్‌.. మీరు నిజమైన ఛాంపియన్ అని అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో అండగా నిలవడానికి మీ దృఢత్వం, బలం అందరికి స్ఫూర్తి.

Here's Mahesh Babu Tweet

పతకం వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు.. మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది. 1.4 బిలియన్ హృదయాలు మీతో పాటు ఉన్నాయి.' అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement