Jani Master Case: ఆమె నన్ను లైంగికంగా వేధించింది.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే, అక్కడ నాపై లైంగిక దాడి చేసి.. నా న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించింది... జానీమాస్టర్‌ మీద కేసు పెట్టిన యువతిపై మరో యువకుడి సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్‌ పై కేసు పెట్టిన అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌ పై మరో యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు.

Jani Master Case: ఆమె నన్ను లైంగికంగా వేధించింది.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే, అక్కడ నాపై లైంగిక దాడి  చేసి.. నా న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించింది... జానీమాస్టర్‌ మీద కేసు పెట్టిన యువతిపై మరో యువకుడి సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు
Choreographer Jani Master booked for sexually assaulting 21-year-old colleague (Photo-X/Video Grab)

Hyderabad, Oct 12: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ (Jani Master) లైంగిక వేధింపుల కేసులో (Rape Case) కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్‌ పై కేసు పెట్టిన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌ పై మరో యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు. ఆమె తనను లైంగికంగా వేధించిందంటూ సదరు  యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్‌ తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్‌ లకు వెళ్లినప్పుడు ఆమె తనపై రేప్ చేసిందని.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే అక్కడ తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పుడు తాను మైనర్‌ అని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.  దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

ఏమిటీ జానీ కేసు?

తనను పలుమార్లు లైంగికంగా దాడి చేశాడని జానీ మాస్టర్ పై అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పోక్సో కింద కేసు నమోదైంది. ఇటీవల జాతీయ అవార్డు తీసుకునేందుకు కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. కేంద్రం జాతీయ అవార్డును వెనక్కి తీసుకుంది. కాగా, జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆమెపై ఇప్పుడు మరో యువకుడు అవే తరహా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

(The above story first appeared on LatestLY on Oct 12, 2024 11:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).