Vijayawada, Oct 11: దక్షిణ బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణం చేత వచ్చే సోమవారం నుంచి ఏపీలో (Andhrapradesh) మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 17 నాటికి ఏపీలోనే ఈ వాయుగుండం తీరం దాటవచ్చని అంచనా వేశారు. అటు రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు పడొచ్చని తెలిపారు.
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
పల్నాడు, శ్రీసత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరితో పాటు పలు జిల్లాల్లో నేడు పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.