టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కుటుంబం. టాటా సంస్థ ఎన్నో రంగాలకు విస్తరించారు. టాటా గ్రూపు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాపార దిగ్గజం గురించి ఆసక్తికర విషయాలు .
రతన్ టాటా వ్యక్తిగత ఆస్తులు వేల కోట్లుగా ఉన్నాయి. 2022 సంవత్సరం లెక్కల ప్రకారం రతన్ టాటా ఆస్తుల విలువ 3 వేల 800 కోట్ల రూపాయలు. ఈ ఆస్తులు అన్ని స్థిర, చరాస్తులుగా ఉన్నాయి. ఖరీదైన ఇళ్లతోపాటు కార్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి. Ola, Ant finanace, yourstory, paytm, lenskart, urban company వంటి 53 స్టార్టప్ కంపెనీల్లో రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు.ముంబై సిటీలో సముద్రానికి ఎదురుగా కొలాబా అనే పెద్ద బంగ్లా ఉంది.. దాని విలువ 200 కోట్ల రూపాయలని అంచనా. జాగ్వార్ ఎఫ్-టైప్ S మసెరటి క్వాట్రో పోర్టే, బెంజ్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.దసాల్క్ ఫాల్కన్ పేరుతో ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది.
ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ 29 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను పరిశీలిస్తే ఆగస్టు 20, 2024 నాటికి దాదాపు 403 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 33.7 లక్షల కోట్లు) ఉంది. ఇంత భారీ సామ్రాజ్యాన్ని విస్తరించిన రతన్ టాటా మాత్రం ఎప్పడూ నిరాడంబరంగానే ఉండేవారు. వ్యాపారం..సేవా రంగాల్లో ఖ్యాతి గడించిన రతన్ టాటా ఆస్తుల లెక్కలు మాత్రం ఆశ్చర్య కరంగానే ఉంటాయి.
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం ఆయన మొత్తం నికర విలువ కేవలం రూ. 3,800 కోట్లు. ఏడాది క్రితం అంటే 2021లో ఆయన మొత్తం సంపద రూ.3,500 కోట్లు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మొత్తం ఆస్తులు కంపెనీ మొత్తం ఆస్తుల్లో 0.50 శాతం కూడా లేదు. టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ ప్రకారం చూస్తే రతన్ టాటా సంపద ఏమీ లేదు. అయితే సంస్థ ఆదాయం మొత్తంలో 66 శాతాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంది. రతన్ టాటా తన కంపెనీల ఆదాయాలను స్వయంగా తీసుకోకుండా ట్రస్ట్ ద్వారా దేశం, తన ప్రజల కోసం ఖర్చు చేస్తారు. టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీలు టాటా ట్రస్ట్ కిందకు వస్తాయి, దీని హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్.
రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి, కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించిన మహారాష్ట్ర క్యాబినెట్
1962లో టాటా స్టీల్ లో ఉద్యోగిగా చేరడంతో మొదలైన రతన్ టాటా ప్రస్థానం... టాటా గ్రూప్ ను 10వేల కోట్ల నుండి లక్ష కోట్ల దాగా ఎదిగేలా చేసింది. అంచెలంచెలుగా ఎదిగిన రతన్ టాటా 1991లో టాటా గ్రూపు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సంస్థను ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. దాదాపు 20ఏళ్లకు పైగా టాటా సన్స్ గ్రూపును ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నడిపారు.
1996లో టాటా టెలిసర్వీసెస్‌ని స్థాపించిన రతన్ జీ, 2004లో ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)గా మార్చి.. సాఫ్ట్ వేర్ రంగంలోనూ లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. 20ఏళ్ళ తర్వాత 2012లో టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి రిటైర్ అయ్యారు.2016 అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు టాటా గ్రూప్ కు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించారు రతన్ టాటా. తర్వాత 2017లో ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చైర్మెన్ బాధ్యతలు స్వీకరించారు. సామాన్యుల సొంత కారు కలను నెరవేర్చిన వ్యాపార చాణక్యుడు రతన్ టాటా. 2009లో నానోను కేవలం లక్ష రూపాయల ఖర్చుతో రతన్ టాటా విడుదల చేశారు. నానో ఆవిష్కరణ రతన్ టాటా ప్రస్థానంలో మరో మైలురాయి అని చెప్పచ్చు.
టెట్లీ (2000): బ్రిటీష్ టీ దిగ్గజం టెట్లీని 450 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం రతన్ టాటా ప్రస్థానంలో మరో ల్యాండ్ మార్క్. ఇండియన్ చేసిన మొదటి అతిపెద్ద విదేశీ కొనుగోళ్లలో ఇది ఒకటి. దీని ద్వారా గ్లోబల్ బివరేజ్ మార్కెట్ లో టాటా తనదైన ముద్ర వేశారు.
కోరస్ (2007): కోరస్‌ను 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా టాటా స్టీల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలిచింది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ (2008): దిగ్గజ బ్రిటిష్ కార్ బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ లను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయటంతో టాటా మోటార్స్ గ్లోబల్ ఆటోమోటివ్ ప్లేయర్‌గా మారింది టాటా గ్రూప్. ఈ డీల్ టాటా మోటార్స్‌ను గ్లోబల్ ప్లేయర్ గా మార్చడమే కాకుండా లగ్జరీ కార్ బ్రాండ్‌లను తిరిగి మార్కెట్ లీడర్స్ గా నిలిపింది.
రతన్ టాటా లవ్ ఫెయిల్యూర్
గొప్ప మానవతావాదిగా, వ్యాపారవేత్తగా రాణించిన రతన్ టాటా వైవాహిక జీవితానికి మాత్రం దూరంగా ఉన్నాయి. వ్యాపారంలో ఎన్నో మైలురాళ్లు సంపాదించిన రతన్ టాటాకు ఓ లవ్ స్టోరీ ఉన్నది. ఆయన ప్రేమకథ ఫెయిల్యూర్ కావడంతో టాటా వైవాహిక జీవితానికి మాత్రం దూరంగా ఉన్నాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. రతన్ టాటా అమెరికాలో ఓ యువతిని ప్రేమించారు.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఆ సమయంలో రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్య పరిస్థితుల రీత్యా భారత్‌కు రావలసి వచ్చింది. ఆ సమయంలో భారత్ – చైనా మధ్య యుద్ధం జరుగుతున్నది.
ఈ కారణంగా ఆమెను భారత్ పంపేందుకు యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో వారి ప్రేమ పెళ్లి పీటల వరకు చేరకుండా మధ్యలోనే ముగిసింది. దీంతో ఆయన ఒంటరి జీవితం గడిపారు. తరువాత కూడా చాలా మంది అమ్మాయిలతో ప్రేమ పడిన ఆయన పనుల్లో బిజీగా ఉండటంతో ఉండడంతో వివాహం వరకు వెళ్లలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తాను పెళ్లి చేసుకోకపోవడానికి బిజినెస్ పనుల్లో ఎంతో బిజీగా ఉండటం.. సరైన సమయం దొరకకపోవడం కూడా ఒక కారణమన్నారు. వ్యాపారరంగంలో సూపర్ సక్సెస్‌గా నిలిచిన అనంతరం చాలా సమయాల్లో పెళ్లి ఆలోచన వచ్చినా.. కుటుంబానికి సరైన సమయం కేటాయించలేమోననే భయం వేసేదని.. ఈ క్రమంలో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించినా ఆ తర్వాత దూరంగా ఉన్నట్లు వివరించారు. దీంతో ఆయన సింగిల్ గానే లైఫ్ లీడ్ చేశారు.
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా రతన్ టాటా ముత్తాత. 1948లో అతని పదేళ్ల వయస్సులో అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అందువల్ల అతనిని నాయనమ్మ నవాజ్ బాయ్ టాటా పెంచారు.రతన్ టాటా ఎనిమిదో తరగతి వరకు ముంబైలోని క్యాంపియన్ స్కూల్లో, ఆ తర్వాత క్యాథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో చదువుకున్నారు. 1955లో న్యూయార్క్ నగరంలోని రివర్ డేల్ కంట్రీ స్కూల్ నుంచి డిప్లొమా పొందారు.
టీసీఎస్‌ను రతన్ టాటా 2004లో స్థాపించారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ఉక్కు తయారీ సంస్థ కోరస్, బ్రిటిష్ ఆటోమోటివ్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్, బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీతో చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది టాటాను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.
2009లో భారతదేశంలో మధ్యతరగతి వారికోసం చౌకైన కార్లను తయారు చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని రూ.లక్ష విలువైన టాటా నానోను మార్కెట్లోకి తీసుకొచ్చారు.
ఆయనకు సేవా గుణం ఎక్కువ. అతని నాయకత్వంలో టాటా గ్రూప్ భారతదేశంలోని గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి కార్నెల్ విశ్వవిద్యాలయంలో 28 మిలియన్ డాలర్ల టాటా స్కాలర్షిప్ నిధిని ఏర్పాటు చేసింది.
2010లో టాటా గ్రూప్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను నిర్మించడానికి 50 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. అక్కడ తన గ్రాడ్యుయేట్ శిక్షణ పొందాడు రతన్ టాటా.
2014లో టాటా గ్రూప్ ఐఐటీ-బాంబేకు రూ.95 కోట్లు విరాళంగా ఇచ్చింది. పేద ప్రజలు, సమాజాల అవసరాలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి చొరవ తీసుకుంది. ఇందుకోసం టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ (టీసీటీడీ)ను ఏర్పాటు చేసింది
జంషెడ్ టాటా కాలం నుంచి వర్షాకాలంలో వీధి కుక్కలను లోపలికి అనుమతించిన చరిత్ర బాంబే హౌస్‌కు ఉంది. రతన్ టాటా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయన బాంబే హౌస్ ప్రధాన కార్యాలయంలో ఇటీవల పునరుద్ధరించిన తరువాత వీధి కుక్కల కోసం ఒక కెన్నెల్ ఏర్పాటు చేశారు. ఇందులో వీధి కుక్కలకు ఆహారం, నీరు, బొమ్మలు అందిస్తున్నారు. వాటి కోసం ఒక ప్లే ఏరియా కూడా ఉంది.