Who Will Succeed Ratan Tata? From Noel Tata to Maya Tata, List of Front-Runners in Succession Race Who Might Take Over the Reins of INR 3,800 Crore Business Empire (Photo-X/ANI)

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ సంస్థల గౌరవ చైర్మన్‌ రతన్ టాటా(86) మరణంతో ఇక ఆయన భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడీ రేసులో మొత్తం ముగ్గురు ఉన్నారు. వారిలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా కుమార్తె మయా టాటా(34) ఒకరు కాగా, ఆమె సోదరుడు నెవిల్లే టాటా (32), వారి సోదరి లీ టాటా (39) పేర్లు వినిపిస్తున్నాయి.

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి, కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించిన మహారాష్ట్ర క్యాబినెట్

రతన్ టాటా తల్లిదండ్రుల పేర్లు నావల్ టాటా, సూని కమిషరియట్‌లు. వీరు 1940లలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నావల్ టాటా 1955లో స్విస్ మహిళ సిమోన్ ను వివాహం చేసుకున్నారు. అతని కుమారులలో ఒకరి పేరు నోయెల్ టాటా. రతన్ టాటాకు పిల్లలు లేనందున, బిలియన్ల విలువైన ఈ ఆస్తి అతని సవతి సోదరుడు నోయెల్ టాటా తరపు వారికి చేరే అవకాశం ఉంది. నోయెల్ టాటాకు మాయ, నావల్, లేహ్ టాటా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా ఆస్తి రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా సంతానానికే దక్కే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

ఎవరు పగ్గాలు చేపడతారు..

మయా టాటా

నోయెల్ టాటా కుమార్తె అయిన మయా టాటా తన కెరియర్‌ను టాటా ఆపర్చ్యూనిటీ ఫండ్‌తో ప్రారంభించి, అనంతరం టాటా డిజిటల్‌లోకి మారారు. ‘టాటా న్యూ’ యాప్‌ను అభివృద్ధి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె తన తోబుట్టువులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తున్నారు.మాయ టాటా బేయెస్ బిజినెస్ స్కూల్ వార్విక్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీలు పొందింది. మాయా టాటా తల్లి దివంగత టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి.. దివంగత బిలియనీర్ పల్లోంజ్ మిస్ట్రీ కుమార్తె.

నెవిల్లే టాటా

మయా సోదరుడైన నెవిల్లే టాటా కూడా రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా కనిపిస్తున్నాడు. కుటుంబ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న ఆయన టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే జంషెడ్ టాటా. ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్‌ను చైన్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. అంతకుముందు, అతనికి ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ బెవరేజ్ విభాగం నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అందులో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న తర్వాత, అతను జూడియో, వెన్సైడ్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. అతను టాటా గ్రూపుకు వారసుడిగా తయారయ్యాడని చాలా మంది నిపుణుల భావన.

లేహ్ టాటా

నెవిల్లే, మాయా టాటా సోదరి 39ఏండ్ల లేహ్ టాటా టాటా గ్రూప్ హోటల్ వ్యాపారం పర్యవేక్షిస్తున్నారు. ఆమె స్పెయిన్ లోని ఐఈ బిజినెస్ స్కూల్ లో చదివారు. అమె 2010లో కొంతకాలం లూయిస్ విట్టన్ లో ఇంటర్నిషిప్ చేశారు. ఆమె తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలెస్ లలో పని చేసింది. ప్రస్తుతం ఆమె టాటా గ్రూప్‌లో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె దృష్టంతా హోటల్ పరిశ్రమపైనే ఉంది.