Whattey Beauty: వాటే వాటే బ్యూటీ.. నువు యాడ ఉంటే ఆడనే ఊటీ, సింగిల్ ఫరెవర్ అన్న బ్యాచిలర్ మింగిల్ అయ్యాడోచ్, 'భీష్మ' సాంగ్ వాటే మూవ్స్, వాటే మాస్!

టిక్ టాక్ యూజర్స్‌కి కూడా ఇంకో సాంగ్ వచ్చి చేరింది. ఈ లేటెస్ట్ సాంగ్‌లో హీరోహీరోయిన్ల స్టెప్పులే కాదు, వారు వేసుకున్న డ్రెస్సులు అదరహో అనిపిస్తున్నాయి. రష్మిక వేసిన చిన్న చిన్న స్కర్టులు, కలర్‌ఫుల్ చీరలు, నితిన్ వేసుకున్న ట్రెండీ గెటప్స్ మీ కళ్లను జిగేల్....

Whattey Beauty Video Promo | Bheeshma Movie | Nithiin, Rashmika | Photo: Aditya Music

వేలైంటైన్ సీజన్లో లవర్ బాయ్ నితిన్ 'సింగిల్ ఫరెవర్' అంటూ సర్‌ప్రైజ్ చేశాడు. 'సింగిల్స్ ఆంథేమ్' ( Singles' Anthem)తో ఎంతో మందికి సింగిల్ బ్యాచిలర్స్‌కి ఊపు ఇచ్చాడు. 'ఐ యామ్ సింగిలే, ఐ యామ్ రెడీ టూ మింగిలే' అని చెప్పిన నితిన్ (Nithiin) కొన్ని రోజులకే రష్మికతో మింగిల్ అయిపోయాడు. 'వాటే వాటే బ్యూటీ.. నువు యాడ ఉంటే ఆడనే ఊటీ' అంటూ రష్మికతో కలిసి మాస్ డ్యుఎట్ వేసేసుకున్నాడు.

నితిన్ - రష్మిక మందాన (Rashmika Mandanna)  కాంబినేషన్‌లో 'భీష్మ' మూవీ (Bheeshma Movie), సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ వేలేంటైన్ నెలలో రాబోతుంది. అంతకుముందు సింగిల్స్ ఆంథేమ్ సూపర్ హిట్ లిరికల్ సాంగ్ విడుదల చేసిన ఈ మూవీ టీమ్, ఇప్పుడు వాటే బ్యూటీ అనే సాంగ్ వీడియో ప్రోమోను విడుదల చేసింది.

నితిన్ టాలీవుడ్ టాప్ డాన్సర్స్‌ లో ఒకడు, రష్మిక కూడా మంచి డాన్సర్, వీరిద్దరూ కలిసి ఒక క్లాస్ బ్యూటిఫుల్ సాంగ్‌కి వేసిన మాస్ స్టెప్స్ నిజంగానే వాటే బ్యూటీ అనిపిస్తున్నాయి. ఆ సాంగ్‌ని చూడటం ఇప్పుడు మీ డ్యూటీ.

Whattey Beauty Video Promo:

టిక్ టాక్ యూజర్స్‌కి కూడా ఇంకో సాంగ్ వచ్చి చేరింది. ఈ లేటెస్ట్ సాంగ్‌లో హీరోహీరోయిన్ల స్టెప్పులే కాదు, వారు వేసుకున్న డ్రెస్సులు అదరహో అనిపిస్తున్నాయి. రష్మిక వేసిన చిన్న చిన్న స్కర్టులు, కలర్‌ఫుల్ చీరలు, నితిన్ వేసుకున్న ట్రెండీ గెటప్స్ మీ కళ్లను జిగేల్ మనిపిస్తుంది.

అంతకుందు నితిన్ సింగిల్ ఫరెవర్ సాంగ్;  #SinglesAnthem

వెంకి కుడుముల దర్శకత్వం వహించిన 'భీష్మ' సినిమాకు నిర్మాతలు తమ అద్భుతమైన ప్రచార వ్యూహాలతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నారు. క్యారెక్టర్ పోస్టర్లు, వీడియో సాంగ్స్, ప్రోమోలు మరియు ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. లవర్స్ డే (valentine day) కానుకగా 2020 ఫిబ్రవరి 21న భీష్మ థియేటర్లలోకి రానుంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement