This Week Movies- OTT Releases: రవితేజ ఈగల్ సినిమా ఎలా ఉంది, గుంటూర్ కారం ఓటీటీలో ప్రేక్షకులకు రుచిని పంచుతుందా? ఈవారం థియేటర్లలో రిలీజైన సినిమాలు, ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాల విశేషాలను ఇక్కడ తెలుసుకోండి!

This Week Movies- OTT Releases | Pixabay/file

This Week Movies- OTT Releases: ఈవారం మరిన్ని కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించనున్నాయి. ఫిబ్రవరి 09, 2024న శుక్రవారం థియేటర్లలో విడుదలైన సినిమాలు, క్లుప్తంగా వాటి రివ్యూలు, అలాగే ఈరోజు నుంచి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు, రాబోయే చిత్రాల విశేషాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.

ఈవారం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు

ఈ వారం మాస్ మహరాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా విడుదలైంది, అలాగే ఏపీ రాజకీయాల నేపథ్యంలో యాత్ర 2, ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ మొదలైన సినిమాలు విడుదలయ్యాయి. వీటి పబ్లిక్ టాక్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం

  • ఈగల్ (తెలుగు): రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య, నవదీప్ తదితరులు నటించారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి మంచి ఎంటర్టైనర్ అని రివ్యూలు వస్తున్నాయి.
  • యాత్ర2 (తెలుగు): వైయస్సార్ గా మమ్ముటి, వైఎస్ జగన్ గా జీవా నటించారు. ఒక వర్గం వారికి ఈ సినిమా నచ్చవచ్చు.
  • లాల్ సలామ్ (తమిళ్ డబ్బింగ్) : రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు నటించిన ఈ సినిమా ఎలాంటి హైప్ లేకుండా వచ్చి యావరేట్ టాక్ సొంతం చేసుకుంది.
  • తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా (హిందీ): షాహిద్ కపూర్, క్రితి సనన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్
  • ట్రూ లవర్ (తెలుగు): మణికందన్, గౌరీ ప్రియ తదితరులు నటించిన ఈ రొమాంటిక్ మూవీ, ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • ది ఐరన్ క్లా (ఇంగ్లీష్) వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్ షిప్ నేపథ్యంలో వాన్ ఎరిచ్ బ్రదర్స్ సాధించిన విజయాలపై బయోపిక్ సినిమా

ఈవారం ఓటీటీలో రిలీజ్ అవుతున్నవి

కొద్దిరోజుల కిందట థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఈరోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక కన్నడలో హిట్ టాక్ తెచ్చుకున్న కాటేరా సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇలాంటి మరెన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ అలరించనుంది. ఏ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారంలో విడుదలైందో ఈ కింద తెలుసుకోండి.

గుంటూరు కారం- 09 ఫిబ్రవరి 2024- నెట్‌ఫ్లిక్స్

కెప్టెన్ మిల్లర్: 09 ఫిబ్రవరి 2024- అమెజాన్ ప్రైమ్

బబుల్‌గమ్: 09 ఫిబ్రవరి 2024- ఆహా

అయలాన్: 09 ఫిబ్రవరి 2024- సన్ నెక్ట్స్

కాటేరా (కన్నడ) : 09 ఫిబ్రవరి 2024- జీ5

భక్షక్ (హిందీ) : 09 ఫిబ్రవరి 2024- నెట్‌ఫ్లిక్స్ (నేరుగా ఓటీటీలో రిలీజైన సినిమా)

ఆర్య సీజన్ 3 (వెబ్ సిరీస్): 09 ఫిబ్రవరి 2024- డిస్నీ+ హాట్‌స్టార్

నా సామి రంగ - ఫిబ్రవరి 15- డిస్నీ+ హాట్‌స్టార్ ఫిల్మ్

హనుమాన్- మార్చ్ 2- జీ5

ఇవే కాకుండా ఇంకా మరెన్నో డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ మూవీలు ఓటీటీలో విడుదలయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement