Bigg Boss Telugu 5: రేపే బిగ్ బాస్ -5 తొలి ఎపిసోడ్ టెలికాస్ట్, హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీరే, ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ - 5 కంటెస్టెంట్లు

తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాల్టీ షో మరోసారి సందడి చేయబోతోంది. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ (Bigg Boss Telugu ) సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ - 5 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్ కు కూడా ప్రముఖ సినీ నటుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.

Bigg Boss Telugu 5 First Teaser (photo-Star maa- Twitter)

తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాల్టీ షో మరోసారి సందడి చేయబోతోంది. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ (Bigg Boss Telugu ) సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ - 5 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్ కు కూడా ప్రముఖ సినీ నటుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సీజన్ - 5 (Bigg Boss Telugu 5 రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. దీంతో, కంటెస్టెంట్లను ఈరోజే హౌస్ లోకి నిర్వాహకులు పంపుతున్నారు.

కంటెస్టెంట్లంతా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్, మారియట్ హోటళ్లలో క్వారంటైన్ లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. రేపు సాయంత్రం బిగ్ బాస్ -5 తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

బిగ్ బాస్ - 5 కంటెస్టెంట్లు వీరే:

యాంకర్ రవి, యానీ మాస్టర్, యూట్యూబర్ సరయు, రేడియో జాకీ కాజల్, సీరియల్ హీరో మానస్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టర్, నటి శ్వేత వర్మ, లహరి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement