Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సంచలన నిర్ణయం, ఆ షో నుంచి బయటకు వచ్చిన సుధీర్, కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ, ప్రియమణి, ఏం జరిగిందటే...

తాజాగా సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడంటూ టాక్ వినిపించింది. ఈ వార్తలపై సుధీర్ స్పందిస్తూ.. తాను జబర్దస్త్ ను వీడడంలేదని.. మరింతగా నవ్వించాలంటూ ఫిక్స్ అయ్యామని చెప్పారు. అయితే ఇపుడు సుధీర్ జబర్దస్త్ నుంచి కాదు.. ఢీ షో నుంచి అవుట్ అయినట్లు తెలుస్తోంది.

Sudigali Sudheer (Image: Twitter)

జబర్దస్త్ షో ద్వారా స్టార్ గా ఎదిగిన నటుడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). తనదైన స్టైల్ లో స్కిట్స్ చేస్తూ.. బుల్లి తెర ప్రేక్షకులను అలరించడం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలతో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గుర్తింపు తెచ్చుకున్నాడు. బాగా పాపులర్ అయ్యాడు. అనంతరం సినిమాల్లో కూడా పలు అవకాశాలు అందుకున్నాడు. అయితే సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) నటనతో ఎంత పాపులర్ అయ్యాడో.. అంతకంటే ఎక్కువగా యాంకర్ రష్మీ తో ఎఫైర్ అంటూ వచ్చే వార్తలతో మరింత పాపులర్ అయ్యాడు. సుధీర్ జబర్దస్త్ కామెడీ షోల్లో చేస్తూనే.. ఢీ డాన్స్ షోలో ఒక మెంటర్ గాను, శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గాను బుల్లి తెరపై పలు అవకాశాలను అందుకున్నాడు. తాజాగా సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడంటూ టాక్ వినిపించింది. ఈ వార్తలపై సుధీర్ స్పందిస్తూ.. తాను జబర్దస్త్ ను వీడడంలేదని.. మరింతగా నవ్వించాలంటూ ఫిక్స్ అయ్యామని చెప్పారు. అయితే ఇపుడు సుధీర్ జబర్దస్త్ నుంచి కాదు.. ఢీ షో నుంచి అవుట్ అయినట్లు తెలుస్తోంది.

కేసులు పెరిగినా ఎలాంటి లాక్‌డౌన్ ఉండదు, తెలంగాణలో మరొకరికి ఒమిక్రాన్, 8కి చేరిన మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య, క‌రోనా మూడో ద‌శ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్న స‌ర్కారు

హైపర్ ఆది తో కలిసి మెంటర్ గా వ్యవహరించిన సుధీర్ ఢీ డాన్స్ 13th కింగ్స్ vs క్వీన్స్ కు మంచి హైప్ తీసుకొచ్చారు. అయితే ఢీ 14 కి మాత్రం సుధీర్ మిస్ అయ్యాడు. సుధీర్ ప్లేస్ లో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ కనిపిస్తున్నాడు. ఢీ డాన్స్ షో లో ఆది తో పాటుగా అఖిల్ మెంటర్ గా ఎంట్రీ ఇచ్చాడు. సుడిగాలి సుధీర్ తనకు సినిమాల్లో వస్తున్న అవకాశాలతో ఢీ షో నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి సుధీర్ ప్లేస్ లో అఖిల్ ఎలా అలరిస్తాడో .. ఆది తో కలిసి ఏ విధంగా సందడి చేస్తాడో చూడాలి మరి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement