CBSE Board Exams 2021 Class 10 & 12 Datesheet: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల, మే 4 నుంచి జూన్ 10 వరకు ఎగ్జామ్స్, యూజీసీ నెట్ 2021 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబందించిన పరీక్షల షెడ్యూల్ (CBSE Board Exams 2021 Class 10 & 12 Datesheet) విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్ నిషాంక్ నేడు ట్విటర్‌లో ప్రకటించారు.
Delhi, February 2: సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబందించిన పరీక్షల షెడ్యూల్ (CBSE Board Exams 2021 Class 10 & 12 Datesheet) విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్ నిషాంక్ నేడు ట్విటర్‌లో ప్రకటించారు. ఈ పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు (CBSE Class 10 Datesheet) రోజూ ఉదయం 10.30గం నుంచి మధ్యాహ్నం 1.30గం వరకు కొనసాగనున్నాయి.
అలాగే, 12వ తరగతి పరీక్షలు (CBSE Class 12 Datesheet) రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. తొలి షిఫ్ట్ ఉదయం 10.30గం నుంచి 1.30గం వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30గం నుంచి 5.30గం వరకు నిర్వహిస్తారు. మహమ్మారి కారణంగా10, 12 తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించారు. కోవిడ్-19 పాండమిక్ ప్రోటోకాల్స్‌ను అనుసరించి పరీక్షలు జరుగుతాయి. ఫేస్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.inను వీక్షించండి.
షెడ్యూల్:
మే 4 నుంచి జూన్ 7 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి
మే 4 నుంచి జూన్ 11 వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి
మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
జులై 15 తేదీలోగా సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల
ఇక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం యుజిసి నెట్ 2021 మేలో పరీక్షలను నిర్వహిస్తుంది. పరీక్షకు సంబందించిన తేదీలను యూజీసీ నెట్ ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు యూజీసీ నెట్ డిసెంబర్ 2020 పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. యూజీసీ నెట్ 2021 పరీక్షా తేదీలు వరుసగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీలో పరీక్షలు నిర్వహించనున్నారు.
జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏడాది రెండు సార్లు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహిస్తుంది. జూన్ నెలలో తొలి పరీక్ష, డిసెంబర్ నెలలో రెండో తుది పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో రెండు పేపర్‌లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. అలాగే పేపర్-II 200 మార్కులకు ఉంటుంది. దీనిలో 100 మల్టీ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. పరీక్ష యొక్క వ్యవధి మూడు గంటలు ఉంటుంది.
తెలంగాణలో మే1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభం కానున్న యూజీసీ నెట్ మే 2021 పరీక్ష దరఖాస్తుల తుది గడువు మార్చి 3న ముగియనుంది. యూజీసీ నెట్ పరీక్షలో అర్హత సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లకు అవకాశం లభిస్తుంది. గతేడాది కరోనా కారణంగా ఒక్కసారే పరీక్ష నిర్వహించారు. మిగతా వివరాల కోసం యూజీసీ నెట్ లింకు క్లిక్ చేయగలరు.
(The above story first appeared on LatestLY on Feb 02, 2021 09:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

