Horoscope Today, 23 April 2022: ఈ రోజు ఈ రాశుల వారికి ధనలాభం ఉంటుంది, ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశుల వారు బంధువుల సలహాలను వినొద్దు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి.
ఈరోజు ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని చేకూరుస్తాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తారు. అర్ధలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు.
Horoscope Today, 23 April 2022: నేటి రాశి ఫలాలను చెక్ చేసుకోండి...
మేషం
ఈరోజు ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని చేకూరుస్తాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తారు. అర్ధలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు.
వృషభం
ఈరోజు సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం.
మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ దర్శనం ఉత్తమం.
మిధునం
ఈరోజు కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి
కర్కాటకం
ఈరోజు శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం మంచిది.
సింహం
ఈరోజు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది
కన్య
ఈరోజు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
తుల
ఈరోజు స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దుర్గాధ్యానం వల్ల మేలు జరుగుతుంది.
వృశ్చికం
ఈరోజు ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. అధికారులు సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్యారాధన శుభదాయకం.
ధనుస్సు
ఈరోజు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. విరోధులను తక్కువ అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.
మకరం
ఈరోజు దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ,సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం.
కుంభం
ఈరోజు ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. ద్వాదశ చంద్రస్థితి అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.
మీనం
ఈరోజు శుభకాలం. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శని శ్లోకాన్ని చదివితే మంచిది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)