JPC On Jamili Elections: జమిలీ ఎన్నికలు...31 మందితో జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం, ప్రియాంక గాంధీ..మనీష్ తివారి సహా కమిటీలో ఉంది వీరే...పూర్తి వివరాలివిగో

ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదంతో దేశంలో జమిలీ ఎన్నికలను తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టగా తాజాగా 31 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది కేంద్రం.

31-member-jpc-on-one-nation-one-election-bill(X)

Delhi, December 19:  ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదంతో దేశంలో జమిలీ ఎన్నికలను తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టగా తాజాగా 31 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది కేంద్రం.

బీజేపీ ఎంపీ చౌదరి జేపీసీ చైర్మన్‌గా ఉండనుండగా బీజేపీ సభ్యులు బన్సూరి స్వరాజ్, సీఎం రమేశ్, పర్షోత్తమ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్, భర్తిహరి మహతవ్, అనిల్ బలూనీ, వీడీ శర్మ, విష్ణు దయాళ్ రామ్, కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ నుంచి నియమితులయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

అలాగే మనీష్ తివారీ, సుఖ్‌దేవ్ భగత్ కాంగ్రెస్ సభ్యులకు కమిటీలో చోటు కల్పించారు సమాజ్ వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్ కు జేపీసీలో చోటు దక్కింది.

తృణమూల్ కాంగ్రెస్ నుండి నుండి కళ్యాణ్ బెనర్జీ, టీడీపీ నుంచి హరీష్ బాలయోగి, ఎన్‌సీపీ నుండి సుప్రియా సూలే (శరద్ పవార్), శివసేన( షిండే) శ్రీకాంత్ షిండే, ఆర్‌ఎల్‌డీ నుండి చందన్ చౌహాన్, జనసేన నుండి బాలశౌరి వల్లభనేనికి చోటు దక్కగా రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉండనున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement