Indian Railways Expansion: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ. 10,021 కోట్లతో 540 కి.మీ.మేర ఐదు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు

దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలలోని అత్యంత రద్దీ మార్గాలతో సహా దక్షిణాదికి సంబంధించి పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదముద్ర వేసింది.

IRCTC (Photo-ANI)

Indian Railways Expansion: దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలలోని అత్యంత రద్దీ మార్గాలతో సహా దక్షిణాదికి సంబంధించి పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదముద్ర వేసింది. ఈ కేబినెట్ నిర్ణయాల వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.

యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయితే జాగ్రత్త.. Fake Error Messageతో స్కామర్లు ఎలా డబ్బులు కొట్టేస్తున్నారో తెలుసా?

కేబినెట్ నిర్ణయాల ప్రకారం, తెలంగాణలోని కీలకమైన ఘట్‌కేసర్ - కాజీపేట సెక్షన్‌లో 110 కిలోమీటర్ల మేర నాలుగో రైల్వే లైను నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,419 కోట్లుగా రైల్వే శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మీదుగా సాగే అరక్కోణం - రేణిగుంట మార్గంలో 3వ మరియు 4వ లైన్ల నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలోని 17 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఐదు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల కోసం మొత్తం రూ. 10,021 కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త లైన్ల నిర్మాణం అందుబాటులోకి రావడం వల్ల రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యం భారీగా పెరగడమే కాకుండా, సరుకు రవాణా వేగవంతమై, ప్రయాణికుల రైళ్ల ఆలస్యానికి చెక్ పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల రవాణా రంగానికి ఈ ప్రాజెక్టులు మైలురాయిగా నిలుస్తాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement