Poonch Encounter: పూంచ్‌లో ఎన్కౌంటర్, నలుగురు విదేశీ ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు, ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్
ఈ ఎన్కౌంటర్లో (Encounter)నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పూంచ్‌లో (Poonch) భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు (Terrorists) మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter)నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పూంచ్ జిల్లాలోని సింధారా (Sindhara) ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి ఇండియన్ ఆర్మీ ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, టెర్రరిస్టులకు మధ్య పెద్దఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి.
భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని అధికారులు తెలిపారు. వారంతా విదేశీ ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్, మ్యాగజైన్, 11 రౌండ్ల బుల్లెట్లు, ఇతర మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని ఇండియన్ ఆర్మీ అధికారులు చెప్పారు.