Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, ప్రియురాలిని 16 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రియుడు, పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకుని దారుణానికి పాల్పడిన యువకుడు
కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో 28 ఏళ్ల యువకుడు తన మాజీ ప్రేయసిని (Man Kills Estranged Lover) కత్తితో పొడిచాడు. నిందితుడు తన ప్రియురాలిని 16 సార్లు కత్తితో (Stabs Her More Than 16 Times) పొడిచి చంపాడని పోలీసు అధికారులు తెలిపారు.
Man Kills Estranged Lover: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో 28 ఏళ్ల యువకుడు తన మాజీ ప్రేయసిని (Man Kills Estranged Lover) కత్తితో పొడిచాడు. నిందితుడు తన ప్రియురాలిని 16 సార్లు కత్తితో (Stabs Her More Than 16 Times) పొడిచి చంపాడని పోలీసు అధికారులు తెలిపారు. తూర్పు బెంగళూరులోని ఆమె కార్యాలయం వెలుపల నిందితుడు.. బాధితురాలిని అందరిముందే (Full Public View Outside Her Office) కళ్లతో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు.
బాధితురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నలమతి అని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది . లీలా మురుగేష్‌పాళ్యంలోని ఒమేగా హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆంధ్రాలోని శ్రీకాకుళానికి చెందిన దినకర్ బాణాలగా గుర్తించారు. అతను దోమలూరులోని ఒక కంపెనీలో హెల్త్‌కేర్ వర్కర్‌గా కూడా పనిచేస్తున్నాడని పోలీస్ అధికారి తెలిపారు.
అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దినకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీసీపీ (తూర్పు) భీమాశంకర్ ఎస్ గులేద్ మాట్లాడుతూ, బెంగళూరు ఈస్ట్‌లోని బాధితురాలి కార్యాలయం వెలుపల రాత్రి 7.30 గంటలకు ఈ హత్య జరిగిందని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం దినకర్, లీలా ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు.
అయితే వరుడు వేరే కులానికి చెందిన వ్యక్తి కావడంతో అమ్మాయి కుటుంబీకులు పెళ్లికి సిద్ధపడలేదని ఆయన అన్నారు.’ తన కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో నిన్ను పెళ్లి చేసుకోలేనని దినకర్‌కు బాధితురాలు తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న నిందితుడు లీలా ఆఫీసు బయట ఆమె కోసం వేచి ఉన్నారని అధికారి తెలిపారు. ఆమె తన వర్క్ ప్లేస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం తర్వాత, దినకర్ కత్తిని తీసి, లీలాను 16 సార్లకు పైగా పొడిచాడు.బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది.
(The above story first appeared on LatestLY on Mar 01, 2023 12:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

